Jan 22,2023 08:14

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 1945 నుండి దాదాపు రెండు దశాబ్దాల పాటు అమెరికా, రష్యా అగ్రరాజ్యాల మధ్య ప్రత్యక్ష యుద్ధం జరగలేదన్నది నిజం. అయితే, రెండు అగ్రరాజ్యాల మధ్య యుద్ధం జరగకపోవటం అంటే 'శాంతి' సుస్థిరమైనట్లేనా, దాన్నే 'శాంతియుత సహజీవనం'గా భావించాలా? సామ్రాజ్యవాదంతో శాంతియుత సహజీవనం సాధ్యమా ? సామ్రాజ్యవాదం తనంతట తాను ప్రపంచ వ్యాప్తంగా నిరంతర యుద్ధంలో మునిగితేలుతున్న శక్తి కాదా? - చే

234

చే గువేరా సామ్రాజ్యవాదుల, దాని తొత్తుల చేతిలో హత్యగావించబడే నాటికి ఆయన వయసు 39 సంవత్సరాలు. ఆయన జీవితాన్ని చదువుతుంటే వాయువేగంతో అనేక జీవితాలు ఒకదాని తర్వాత ఒకటిగా సినిమా రీల్‌లాగా మారిపోతున్నట్లే అనిపిస్తుంది. సుశిక్షితుడైన వైద్యుడు. వైద్య విద్యార్థిగా ఉన్న సమయంలోనే యావత్‌ లాటిన్‌ అమెరికా దేశాలను చుట్టేసి వచ్చాడు. పుట్టుక రీత్యా అర్జెంటీనా వాసి.

జీవితమంతా పెట్టుబడిదారీ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన విప్లవకారుడు చే గువేరా. ఈయన కాలంలో ప్రపంచంలో మూడోవంతు మానవాళి సోషలిస్టు దేశాల్లో నివసిస్తోంది. పెట్టుబడిదారీ వ్యవస్థకు, సోషలిస్టు వ్యవస్థకు మధ్య విశ్వవ్యాప్త వ్యవస్థాగత వైరుధ్యం దైనందిన జీవితంలోనూ కనిపించేది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా ఖండాల్లో జాతీయ విముక్తి పోరాటాల విస్ఫోటనం కొనసాగుతున్న సమయం అది. విప్లవాత్మక జాతీయవాదానికీ, కమ్యూనిజానికీ మధ్య అవినాభావ సంబంధం ఉండేది.
         చే గువేరా హత్యగావించబడే నాటికి ఆయన వయసు 39 సంవత్సరాలు. పుట్టుక రీత్యా అర్జెంటీనా వాసి. ఆయన సుశిక్షితుడైన వైద్యుడు. వైద్య విద్యార్థిగా ఉన్న సమయంలోనే లాటిన్‌ అమెరికాను చుట్టి వచ్చాడు. 1954లో గ్వాటిమాలా ప్రయాణంలో తొలిసారి మార్క్సిజాన్ని అథ్యయనం చేశాడు. తరువాత ఫైడల్‌ కాస్ట్రోను కలిశాడు. ప్రవాస విప్లవకారులకు సేవలందించే వైద్యుడిగా ఆ బృందంతో జట్టుకట్టిన చే అతి తక్కువ సమయంలోనే తిరుగుబాటు సైన్యంలో కీలకమైన కమాండర్‌ స్థాయికి ఎదిగాడు.

555

         విప్లవానంతరం క్యూబా ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా, జాతీయ బ్యాంకులకు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు. ఈ బాధ్యతలతో పాటు యూరోపియన్‌, ఆసియా, ఆఫ్రికా దేశాల్లో క్యూబా రాయబారిగా నియమితులయ్యారు. అల్జీర్స్‌ మొదలు న్యూయార్క్‌ వరకు అంతర్జాతీయ వేదికల్లో క్యూబా అధికారిక ప్రతినిధిగా పర్యటించారు. వీటిలో కొన్ని అధికారికంగా జరిగినవైౖతే మరికొన్ని రహస్య పర్యటనలు. అధికారిక పర్యటనల్లో దౌత్య వాణిజ్య చర్చలు నిర్వహించారు. సోవియట్‌ యూనియన్‌తోపాటు ఇతర సోషలిస్టు దేశాలతో బహుముఖ ఒప్పందాలు చేసుకున్నారు. రహస్య పర్యటనల్లో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా చర్చలు జరిగేవి. వీటిలో అత్యంత సాహసోపేతమైన చర్చలు బొలీవియా, అర్జెంటీనాలలో విప్లవ వ్యూహానికి సంబంధించినవి. చే నాయకత్వం వహిస్తున్న గెరిల్లా దళాన్ని, బొలీవియా సేనలు చుట్టుముట్టాయి. అమెరికన్‌ సిఐఎ సలహా మేరకు చే ను బంధించారు.
        విప్లవకార్యాచరణాత్మకమైన జీవితాన్ని గడిపిన చే గువేరా విలువైన రచనలు చేశారు. వాటిలో చాలావరకు స్పానిష్‌ భాష నుండి ఇతర భాషల్లోకి తర్జుమా కాలేదు. ఈ సంకలనంలో నిర్ధిష్ట ప్రయోజనాన్ని ఆశించి చేసిన రెండు రచనలు చేగువేరా మేధస్సుకు, దక్షతకు దర్పణం పడతాయి. ఆయన రచనల్లో ప్రస్తావించిన అనేక భావనలు 'తిరుగుబాటు సైన్యపు సామాజిక ఆదర్శాలు' (1959) 'విప్లవ వైద్యుడు (1960), 'యువ కమ్యూనిస్టు కావాలంటే' (1962) వంటి రచనల్లో ప్రస్ఫుటితమౌతాయి.
          మొదటిసారి ఆఫ్రికా, ఆసియా, లాటిన్‌ అమెరికా దేశాల ప్రథమ సంఘీభావ మహాసభకు క్యూబా ఆతిధ్యమిచ్చింది. ఈ మూడు ఖండాల మహాసభ 1966 జనవరి 3-15 తేదీల్లో జరిగింది. చివరి రోజైన జనవరి 15న ఆఫ్రికా, ఆసియా, లాటిన్‌ అమెరికా దేశాల సంఘీభావ సభ జరిగింది. మహాసభకు 82 దేశాల నుండి 512 మంది ప్రతినిధులు, 270 మంది అతిధులు హాజరయ్యారు. ట్రైకాంటినెంటల్‌ సందేశం బులెటిన్‌ రూపంలో ప్రచురితమైంది. ఈ బులెటిన్‌ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రజల దగ్గరకు చేర్చింది. ట్రైకాంటినెంటల్‌ అనే ద్వైమాస సైద్ధాంతిక పత్రిక వర్ధమాన దేశాలకు చెందిన సామ్రాజ్యవాద వ్యతిరేక మేధావుల రచనలతో వెలువడింది.
          మొరాకోకు చెందిన మెహ్దిబెన్‌ బర్కా మార్క్సిస్టు మేధావి. మొదటి ట్రైకాంటినెంటల్‌ మహాసభ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు. వేదిక ప్రాధాన్యతను ఆయన ఇలా వివరించాడు: 'హవానాలో జరిగిన సామ్రాజ్యవాద వ్యతిరేక మహాసభ చారిత్రక ప్రాధాన్యత కలిగినది. అక్టోబరు విప్లవం, మూడో ప్రపంచ దేశాల జాతీయ విముక్తి కార్యాచరణలను ఏకతాటి మీదకు తీసుకువచ్చే వేదిక. క్యూబాలో ఈ మహాసభ జరగటం అద్వితీయ పరిణామం' అని.

222

          హవానాలో ఈ మహాసభ జరుగుతున్న సమయంలో చే ఆఫ్రికా దేశాల్లో విప్లవ సంఘీభావం ప్రకటించటంతోపాటు ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొన్నాడు. 1967, ఏప్రిల్‌ 16 నాటి పత్రిక ప్రారంభ సంచికలో 'రెండు, మూడు.. అనేక వియత్నాంలను సృష్టించాలి, అదే నేటి అవసరం' అన్న శీర్షికతోను, మార్చ్‌ (పదండి ముందుకు) అనే చారిత్రక ఉరుగ్వే పత్రిక 1965 మార్చి నెల సంచికలో 'సోషలిజం - క్యూబా ప్రజలు' అన్న మరో శీర్షికతోను చే రాసిన వ్యాసాలు ప్రచురించారు. 'ట్రైకాంటినెంటల్‌కు సందేశం' అన్న శీర్షికతో రాసిన వ్యాసంలో పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాద వ్యతిరేక సూచనలు ఇచ్చారు. 'సామ్రాజ్యవాదం ఓ విశ్వవ్యాపిత వ్యవస్థ. పెట్టుబడిదారీ విధానపు చరమాంకం. దాన్ని విశ్వవ్యాప్తంగానే ఓడించాలి. నిజమైన కార్మికవర్గ అంతర్జాతీయతను మనం అభివృద్ధి చేయాలి. అంతర్జాతీయ కార్మికవర్గపు సైన్యాన్ని సిద్ధం చేయాలి' అన్నాడు.
        చే రాసిన 'సోషలిజం-క్యూబా ప్రజలు' రచనలో క్యూబన్‌ విప్లవ రూపకల్పనకు సంబంధించిన ప్రస్తావిస్తాడు. మిగిలినవన్నీ విప్లవ కార్యక్రమానికి కేంద్రకమైన అంశాలుగా చే భావించిన అంశాలకు సంబంధించిన విశ్లేషణలే. కమ్యూనిజం గురించిన విశ్లేషణలే. అంతకు పూర్వం రాసిన మరికొన్ని రచనల్లో క్యూబా విప్లవానికీ, మార్క్సిజానికీ మధ్య ఉన్న సంబంధం గురించి ఆసక్తికరమైన విశ్లేషణ చేస్తాడు. ఉదాహరణకు 'లాటిన్‌ అమెరికా తొలి యువజన మహాసభ'లో ఇచ్చిన ఉపన్యాసంలో ఇలా పేర్కొన్నాడు:
          'ఈ విప్లవం మార్క్సిస్టు విప్లవం అయితే-జాగ్రత్తగా వినండి. నేను మార్క్సిస్టు అని సంభోదిస్తున్నాను.. ఈ విప్లవం తన స్వంత పద్ధతుల్లో మార్క్స్‌ చెప్పిన మార్గాన్ని ఎంచుకుంది.. ఈ రోజు మనం మార్క్సిజాన్ని ఆచరణలో పెడుతున్నామంటే, ఆ సిద్ధాంతాన్ని మనం ఇక్కడే కనుగొన్నాము.. ఆ రోజల్లో.. మావో సేటుంగ్‌ రాసిన ఓ చిన్న కరపత్రం మన చేతికి చిక్కింది.. అప్పటికే గెరిల్లా వ్యూహాలు, ఎత్తుగడల పంథాను మనం ఇక్కడ అదే రీతిలో అమలు చేస్తున్నాం.'
         'క్యూబా విప్లవం-దాని సిద్ధాంతం గురించిన నోట్స్‌' అన్న రచనలో.. 'విప్లవకారులమైన మేము ఆచరణవాదులుగా శాస్త్రజ్ఞుడైన మార్క్స్‌ దర్శించిన చలన సూత్రాలను అమలు చేస్తూ మా పోరాటాన్ని కొనసాగిస్తాము. తిరుగుబాటు పథంలో ప్రయాణం ప్రారంభించిన మేము అనుభవాలకు అనుగుణంగా సర్దుబాటు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాము. నాయకులు ఏమి చెప్పారు, వారికి మార్క్సిస్టు సూత్రాల గురించి సైద్ధాంతికంగా ఏమి తెలుసు అన్న దాంతో నిమిత్తం లేకుండా క్యూబా విప్లవ గమనంలో మార్క్సిజం చలన సూత్రాలు ఉన్నాయి.'
         అద్భుతమైన వాక్యాలు ఇవి. చే, కాస్ట్రో వారి సహచరులు ఆచరణాత్మక విప్లవకారులు. వీరు విప్లవ పథంలో అడుగుపెట్టినప్పుడు, గెరిల్లా దళాలను సమీకరిస్తున్న సమయంలో మార్క్స్‌ ప్రతిపాదించిన కార్మికవర్గ విప్లవ సిద్ధాంతం గురించో మావో ప్రతిపాదించిన గెరిల్లా యుద్ధ తంత్రం గురించో తెలిసి గెరిల్లా యుద్ధం ప్రారంభించలేదు. విప్లవ కార్యాచరణే మార్క్సిస్టు సిద్ధాంతపు వస్తుగత వాస్తవికతను వ్యక్తీకరించేదిగా ఉంది.
         'సోషలిజం-క్యూబా ప్రజలు'' అన్న రచనలో పాశ్చాత్య దేశాల్లో మార్క్సిజం, కేవలం అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాల్లో అన్ని అవకాశాలూ ఆవిరయ్యాక మాత్రమే విప్లవం సాధ్యమన్నట్లు వారి అవగాహన ఉందని చెబుతారు. పెట్టుబడిదారీ వ్యవస్థలో అంతర్గత వైరుధ్యాలను విశ్లేషించటానికే తమ శక్తియుక్తులను వెచ్చించటాన్ని చే విమర్శిస్తాడు. దీనికి భిన్నంగా సామ్రాజ్యవాదం గురించి రూపొందించిన సిద్ధాంతంతో లెనిన్‌ ఈ వాదనను తిప్పికొట్టాడు. సామ్రాజ్యవాదపు గొలుసులో బలహీనమైన లింకును తెగ్గొట్టడం ద్వారా విప్లవం సాధించవచ్చనీ, అంటే భావి విప్లవాలన్నీ అణచివేతకు గురైన దేశాల్లోనే సంభవించనున్నాయని అంచనా వేశారు.

567

       కమ్యూనిజం అంటే కేవలం ఉత్పత్తి విధానం, వర్గ సంబంధాలను ఉన్నత దశకు తీసుకెళ్లే వ్యవస్థ మాత్రమే కాదనీ, మానవాళి సర్వతోముఖాభివృద్ధికి పునాదులు వేసే వ్యవస్థ కూడా అని చెప్పాడు. 'పరాయీకరించబడిన మనిషి చైతన్యంతో బంధనాలు తెగ్గొట్టుకున్నపుడే విముక్తి పొందిన శ్రమశక్తి పరివర్తన చెందుతుంది' అని చెబుతాడు. క్యూబా విప్లవం నేర్పే పాఠాలే చే రచనలకు ఉన్న తక్షణ నేపథ్యం. 'ట్రైకాంటినెంటల్‌కు సందేశం' అన్న వ్యాసంలో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 1945 నుండి దాదాపు రెండు దశాబ్దాల పాటు ప్రపంచంలో నెలకొన్న శాంతియుత వాతావరణం గురించి చర్చిస్తూ అమెరికా, రష్యా మధ్య యుద్ధం జరగకపోవటం అంటే 'శాంతి' సుస్థిరమైనట్లేనా, దాన్నే 'శాంతియుత సహజీవనం'గా భావించాలా..? సామ్రాజ్యవాదంతో శాంతియుత సహజీవనం సాధ్యమా..? సామ్రాజ్యవాదం తనంతట తాను ప్రపంచ వ్యాప్తంగా నిరంతర యుద్ధంలో మునిగితేలుతున్న శక్తి కాదా..? అని ప్రశ్నల వర్షం కురిపిస్తాడు.
         తన సందేశంలో కొరియన్‌ యుద్ధం గురించి ప్రస్తావిస్తూ 'ప్రతిష్ట కోల్పోయిన ఐక్యరాజ్యసమితి నీడలో అమెరికా నాయకత్వంలో డజన్ల కొద్దీ దేశాల సైన్యం కొరియన్‌ యుద్ధంలో పాల్గొన్నది' అని గుర్తుచేస్తాడు. కొరియన్‌ యుద్ధంలో అమెరికా దాదాపు 20 లక్షల మంది సైన్యాన్ని మోహరించింది. 6,35,000 టన్నుల బాంబుల వర్షం కురింపించింది. అందులో 32,557 టన్నులు అత్యంత ప్రమాదకరమైన నాపాం బాంబులు. వియత్నాం యుద్ధం గురించి ప్రస్తావిస్తూ ఏకకాలంలో అమెరికా, జపాన్‌, ఫ్రాన్స్‌లను ఎదుర్కొని వియత్నాం వీరోచితంగా నిలబడిందని వివరిస్తాడు.
చైనా, రష్యాల మధ్య తలెత్తిన విబేధాలు తీవ్రమైన పర్యవసానాలకు దారితీయనున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తాడు. 'దురాక్రమణకు గురవుతున్న దేశం విజయం సాధించాలంటే వారితో భుజం భుజం కలిపి చావుకైనా సిద్ధపడి నడవాలి' అంటూ కర్తవ్యబోధతో విపులీకరించాడు: 'అమెరికా సామ్రాజ్యవాదపు దురాక్రమణదారుగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఇది సాగిస్తున్న మారణకాండ, ఘోరకలి మాటలకందనిది. ఈ విషయాలన్నీ మనకు తెలిసినవే మిత్రులారా.
          అవకాశం వచ్చినప్పుడు వియత్నాంను సోషలిస్టు ప్రపంచంలో అంతర్భాగంగా మార్చుకునే ప్రయత్నం చేయనివారు కూడా దోషులే అవుతారు. ఆయా దేశాలు నిర్దిష్ట సమయంలో వియత్నాంకు పూర్తిస్థాయిలో బాసటగా నిలిస్తే మరో ప్రపంచస్థాయి యుద్ధం జరిగి ఉండేదేమో. అటువంటి దుస్థితికి సామ్రాజ్యవాదాన్ని నెట్టే అవకాశాన్ని మనం కోల్పోయాము. పరస్పరం ప్రత్యక్ష దూషణలకు దిగిన సోషలిస్టు శిబిరంలోని ప్రతినిధులు కూడా దోషులే అన్నది నిస్సందేహం.' అని ఆయన అభిప్రాయాన్ని నిర్ద్వంద్వంగానే వ్యక్త పరిచారు.
         చే, కాస్ట్రోలు తమ సోదర సోషలిస్టు దేశాలు అనుసరిస్తున్న విధానాలను విమర్శనాత్మక దృష్టితోనే చూసేవారు. ట్రైకాంటినెంటల్‌ మహాసభ ఏర్పాటు చేసిన ఉద్దేశ్యం.. సహకారం, సమన్వయంతో కూడిన సాయుధ విప్లవ పోరాటాల ద్వారా సామ్రాజ్యవాదపు శక్తి ఒకచోట కేంద్రీకృతమవకుండా చేయడమే.

456

         మహాసభ ముగింపు ఉపన్యాసంలో కాస్ట్రో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 'క్యూబా విప్లవకారుల దృష్టిలో ప్రపంచమంతా సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట కేంద్రమే. ప్రపంచంలో ఏ మూల ఎవరికి విప్లవోద్యమ ఆవశ్యకత ఉన్నా.. క్యూబా వారికి అండగా ఉంటుంది. ప్రతి విప్లవకారుని కర్తవ్యం విప్లవ క్రమాన్ని పురోగమింపచేయటమే. మనసా వాచా కర్మణా విప్లవ క్రమంలో భాగస్వాములు కావటమే.' అని చెప్పాడు.
        ఈ వ్యాసంలో చే ప్రతిపాదించినట్లుగా మూడు ఖండాల్లో విప్లవాలు వేతన కార్మికుని ఆధారంగానే పురోగమించాలి. పారిశ్రామికాభివృద్ధి, భౌతిక సంపదలు ప్రాథమిక స్థాయిలో ఉన్న సమాజాల్లో సైతం గౌరవప్రదమైన, హుందాతనంతో కూడిన, ప్రాథమికంగా మంచి ఆరోగ్యకరమైన సమాజాలను నిర్మించవచ్చు: ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సంబంధాలను ఆధునీకరించటం అన్న సాంప్రదాయక అవగాహనతో పాటు ప్రజల ప్రాథమిక భద్రత, మేధోపరమైన అభివృద్ధితో పాటు సోషలిస్టు సంస్కృతిని పెంపొందించటానికి అనివార్యమైనవని చెబుతాడు. పెట్టుబడిదారీ వ్యవస్థ ధ్వంసం చేసిన మానవ సామర్ధ్యాలను మానవత్వంతో కూడిన సమాజాన్ని నిర్మించటానికీ కృషి చేయాల్సి ఉంటుందని విశ్లేషిస్తాడు.
        దీనికి భిన్నంగా తనకు తాను కేంద్రంగా ఉండే, ఇతరుల ప్రయోజనాలతో నిమిత్తం లేకుండా స్వార్జితం కోసం ఆరాటపడే వ్యక్తులను తయారుచేస్తూ ప్రపంచాన్ని నానాటికీ పరాయీకరించే ప్రపంచాన్ని నిర్మించటానికి ప్రయత్నం చేస్తుంది. 'కొత్త పురుషుడు, కొత్త మహిళ'ను తయారు చేయడానికి చే గువేరా చెప్తున్న క్రమంలో, పరాయీకరణ చెందని స్వతంత్రుడు విప్లవాత్మక సమాజ నిర్మాణానికి అనివార్యమైన కేంద్రంగా ఉంటాడు. ఈ విషయాన్ని గుర్తించటం సోషలిస్టు సమాజాన్ని నిర్మించటంలో కేంద్రకాంశం. ప్రతి మనిషికీ పౌష్టికాహారం, వైద్యం, విద్య వంటి కనీస ప్రాథమిక భౌతిక అవసరాలు తీరకుండా నైతిక సంఘీభావ వ్యక్తీకరణ సామర్ధ్యం సమకూరదన్నది చే అవగాహనలో ఓ కోణం.. అయితే అంతర్జాతీయ సంఘీభావాలు, బాధ్యతలు మరో కోణంలో ఉన్నాయి. మరో రకంగా చెప్పాలంటే విప్లవ జాతీయత, అంతర్జాతీయతల మధ్య ఉండే లేదా ఉండాల్సిన గతితార్కిక సంబంధమే చే గువేరా.
          సామ్రాజ్యవాద వ్యతిరేక విప్లవ పోరాట కేంద్రాన్ని ప్రారంభించటానికి బొలీవియా వెళ్లబోయే ముందు చే గువేరా రాసిన ఈ వాక్యాలు చదువుతుంటే ఆయన తన ముందున్న చావును ధైర్యంగా ఆహ్వానిస్తూ, మననూ సన్నద్ధం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది.
        'ఏదో ఒకరోజు ఏదో ఒక దేశంలో మనం తుది శ్వాస విడవాల్సి వచ్చినప్పుడు, మన మాతృభూమిగా మారిన ఆ దేశంలో రక్త తర్పణం గావించినప్పుడు ఒక్క విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మన కార్యాచరణ కార్మికవర్గ సైన్యంలో చిన్న పరమాణువులుగానే ప్రారంభించాలి. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రజలందరినీ ఐక్యం చేసే యుద్ధ గీతంతో మన ప్రయాణం సాగాలి. మన చేతిలోని ఆయుధం నేలను తాకకుండా పట్టుకోవటానికి మరో చేయి ముందుకొచ్చే వరకు.. మరో మనిషి మర ఫిరంగుల మోత నడుమ విజయం కోసం యుద్ధ నగారాలు మోగిస్తూ మన శవపేటికను మోయటానికి భుజమందించే మరో మనిషి దొరికేలా చూసుకుందాం.' అన్న పోరాట యోధునికి నివాళులర్పిద్దాం.

3456

                                                                        కార్యకర్తలకు కర్తవ్య బోధ....

మనం సోషలిస్టులం, మరింత స్వేచ్ఛ అనుభవిస్తున్నాం, ఎందుకంటే మనం మన కర్తవ్య నిర్వహరణలో మరింత సంతృప్తి చెందుతున్నాం గనుక;
మన పూర్తి స్వేచ్ఛకు సంబంధించిన చట్రం ఇప్పటికే తయారైంది. రక్త మాంసాలు, దుస్తులు రూపొందించాలి. వాటిని మనం సృష్టిస్తున్నాం. రక్తంతోనూ, త్యాగాలతోనూ మనకు స్వేచ్ఛ వచ్చింది, ప్రతిరోజూ నిలబడుతోంది. మన త్యాగం చైతన్యపూరితమైనది. మనం నిర్మించే స్వేచ్ఛా ప్రపంచానికి చెల్లిస్తున్న ఇన్‌స్టాల్‌మెంట్‌ అది. మార్గం సుదీర్ఘమైనది. కొంత భాగం ఎలా ఉంటుందో మనకు తెలియదు. మన పరిమితులు మనకు తెలుసు. మనం 21వ శతాబ్దపు మానవులను, అంటే మనల్ని మనం తయారు చేసుకుంటాం. మనం కొత్త సాంకేతిక శాస్త్రంతో కొత్త మానవుణ్ణి, కొత్త స్త్రీ పురుషులను తయారు చేయడానికి రోజువారీగా కృషి చేస్తాం. ప్రజలను సమీకరించి, నాయకత్వం వహించడంలో వ్యక్తుల పాత్ర ఉంటుంది. ప్రజల అత్యున్నత లక్షణాలను, ఆకాంక్షలను ఇముడ్చుకున్నవారు, ఎంచుకున్న మార్గాన్ని విడనాడనివారు అటువంటి పాత్ర నిర్వహించ గలుగుతారు. మార్గాన్ని సుగమం చేసేది మాత్రం పార్టీ. పార్టీ అంటే అగ్రగామి దళం, మంచివాళ్లలో ఉత్తమోత్తమమైన వాళ్లతో కూడినది.
మన కృషికి మౌలికమైన పదార్ధం యువతరం. మనం దానిపై ఆశలు పెట్టుకుంటాం. మన తరువాత పతాకాన్ని చేబూనడానికి వారిని సిద్ధం చేస్తాం.                                                                                                                                            - ఎర్నెస్టో చే గువేరా

జీవితమంతా పెట్టుబడిదారీ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన విప్లవకారుడు చే గువేరా. ఈయన కాలంలో ప్రపంచంలో మూడోవంతు మానవాళి సోషలిస్టు దేశాల్లో నివసిస్తోంది. పెట్టుబడిదారీ వ్యవస్థకు, సోషలిస్టు వ్యవస్థకు మధ్య విశ్వవ్యాప్త వ్యవస్థాగత వైరుధ్యం దైనందిన జీవితంలోనూ కనిపించేది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా ఖండాల్లో జాతీయ విముక్తి పోరాటాల విస్ఫోటనం కొనసాగుతున్న సమయం అది. విప్లవాత్మక జాతీయవాదానికీ, కమ్యూనిజానికీ మధ్య అవినాభావ సంబంధం ఉండేది.
       చే గువేరా హత్యగావించబడే నాటికి ఆయన వయసు 39 సంవత్సరాలు. పుట్టుక రీత్యా అర్జెంటీనా వాసి. ఆయన సుశిక్షితుడైన వైద్యుడు. వైద్య విద్యార్థిగా ఉన్న సమయంలోనే లాటిన్‌ అమెరికాను చుట్టి వచ్చాడు. 1954లో గ్వాటిమాలా ప్రయాణంలో తొలిసారి మార్క్సిజాన్ని అథ్యయనం చేశాడు. తరువాత ఫైడల్‌ కాస్ట్రోను కలిశాడు. ప్రవాస విప్లవకారులకు సేవలందించే వైద్యుడిగా ఆ బృందంతో జట్టుకట్టిన చే అతి తక్కువ సమయంలోనే తిరుగుబాటు సైన్యంలో కీలకమైన కమాండర్‌ స్థాయికి ఎదిగాడు.
           విప్లవానంతరం క్యూబా ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా, జాతీయ బ్యాంకులకు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు. ఈ బాధ్యతలతో పాటు యూరోపియన్‌, ఆసియా, ఆఫ్రికా దేశాల్లో క్యూబా రాయబారిగా నియమితులయ్యారు. అల్జీర్స్‌ మొదలు న్యూయార్క్‌ వరకు అంతర్జాతీయ వేదికల్లో క్యూబా అధికారిక ప్రతినిధిగా పర్యటించారు. వీటిలో కొన్ని అధికారికంగా జరిగినవైౖతే మరికొన్ని రహస్య పర్యటనలు. అధికారిక పర్యటనల్లో దౌత్య వాణిజ్య చర్చలు నిర్వహించారు. సోవియట్‌ యూనియన్‌తోపాటు ఇతర సోషలిస్టు దేశాలతో బహుముఖ ఒప్పందాలు చేసుకున్నారు. రహస్య పర్యటనల్లో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా చర్చలు జరిగేవి. వీటిలో అత్యంత సాహసోపేతమైన చర్చలు బొలీవియా, అర్జెంటీనాలలో విప్లవ వ్యూహానికి సంబంధించినవి. చే నాయకత్వం వహిస్తున్న గెరిల్లా దళాన్ని, బొలీవియా సేనలు చుట్టుముట్టాయి. అమెరికన్‌ సిఐఎ సలహా మేరకు చే ను బంధించారు.
         విప్లవకార్యాచరణాత్మకమైన జీవితాన్ని గడిపిన చే గువేరా విలువైన రచనలు చేశారు. వాటిలో చాలావరకు స్పానిష్‌ భాష నుండి ఇతర భాషల్లోకి తర్జుమా కాలేదు. ఈ సంకలనంలో నిర్ధిష్ట ప్రయోజనాన్ని ఆశించి చేసిన రెండు రచనలు చేగువేరా మేధస్సుకు, దక్షతకు దర్పణం పడతాయి. ఆయన రచనల్లో ప్రస్తావించిన అనేక భావనలు 'తిరుగుబాటు సైన్యపు సామాజిక ఆదర్శాలు' (1959) 'విప్లవ వైద్యుడు (1960), 'యువ కమ్యూనిస్టు కావాలంటే' (1962) వంటి రచనల్లో ప్రస్ఫుటితమౌతాయి.
          మొదటిసారి ఆఫ్రికా, ఆసియా, లాటిన్‌ అమెరికా దేశాల ప్రథమ సంఘీభావ మహాసభకు క్యూబా ఆతిధ్యమిచ్చింది. ఈ మూడు ఖండాల మహాసభ 1966 జనవరి 3-15 తేదీల్లో జరిగింది. చివరి రోజైన జనవరి 15న ఆఫ్రికా, ఆసియా, లాటిన్‌ అమెరికా దేశాల సంఘీభావ సభ జరిగింది. మహాసభకు 82 దేశాల నుండి 512 మంది ప్రతినిధులు, 270 మంది అతిధులు హాజరయ్యారు. ట్రైకాంటినెంటల్‌ సందేశం బులెటిన్‌ రూపంలో ప్రచురితమైంది. ఈ బులెటిన్‌ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రజల దగ్గరకు చేర్చింది. ట్రైకాంటినెంటల్‌ అనే ద్వైమాస సైద్ధాంతిక పత్రిక వర్ధమాన దేశాలకు చెందిన సామ్రాజ్యవాద వ్యతిరేక మేధావుల రచనలతో వెలువడింది.
          మొరాకోకు చెందిన మెహ్దిబెన్‌ బర్కా మార్క్సిస్టు మేధావి. మొదటి ట్రైకాంటినెంటల్‌ మహాసభ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు. వేదిక ప్రాధాన్యతను ఆయన ఇలా వివరించాడు: 'హవానాలో జరిగిన సామ్రాజ్యవాద వ్యతిరేక మహాసభ చారిత్రక ప్రాధాన్యత కలిగినది. అక్టోబరు విప్లవం, మూడో ప్రపంచ దేశాల జాతీయ విముక్తి కార్యాచరణలను ఏకతాటి మీదకు తీసుకువచ్చే వేదిక. క్యూబాలో ఈ మహాసభ జరగటం అద్వితీయ పరిణామం' అని.
          హవానాలో ఈ మహాసభ జరుగుతున్న సమయంలో చే ఆఫ్రికా దేశాల్లో విప్లవ సంఘీభావం ప్రకటించటంతోపాటు ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొన్నాడు. 1967, ఏప్రిల్‌ 16 నాటి పత్రిక ప్రారంభ సంచికలో 'రెండు, మూడు.. అనేక వియత్నాంలను సృష్టించాలి, అదే నేటి అవసరం' అన్న శీర్షికతోను, మార్చ్‌ (పదండి ముందుకు) అనే చారిత్రక ఉరుగ్వే పత్రిక 1965 మార్చి నెల సంచికలో 'సోషలిజం - క్యూబా ప్రజలు' అన్న మరో శీర్షికతోను చే రాసిన వ్యాసాలు ప్రచురించారు. 'ట్రైకాంటినెంటల్‌కు సందేశం' అన్న శీర్షికతో రాసిన వ్యాసంలో పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాద వ్యతిరేక సూచనలు ఇచ్చారు. 'సామ్రాజ్యవాదం ఓ విశ్వవ్యాపిత వ్యవస్థ. పెట్టుబడిదారీ విధానపు చరమాంకం. దాన్ని విశ్వవ్యాప్తంగానే ఓడించాలి. నిజమైన కార్మికవర్గ అంతర్జాతీయతను మనం అభివృద్ధి చేయాలి. అంతర్జాతీయ కార్మికవర్గపు సైన్యాన్ని సిద్ధం చేయాలి' అన్నాడు.

887

ఐజాజ్‌ అహ్మద్‌