నా బాట
నా వింతపు చీకటి
నా వెలుగుకు
ఈ రేగటి...
ఈ కాలమానానికి
కదిలించిన
ఈ జగత్‌జ్యోతిలో
పలువురికి తెలిసిన
ఈ జగతిలో
నేను ఒక్కడిని
నేను బాటసారిని.....
ఈ రాత్రివేళ
కనుమరుగైన
చీకటి నక్షత్రాల్లో
నేను ఒక్కడిని
నేనో మనస్సున్నవాడిని...
కంటిరెప్పల
కనుపాప
చేరువలో ముఖ సౌదర్యంలో
చిరునవ్వు చిగురించిన రోజు
అక్కడ
నేను ఒక్కడినే
నేనో పిపాసిని...
శరీరాన్ని మలుచుట
తరుచుట
పరిగెత్తుట
బుద్ది, సహనం
మానవత్వంతో
ఆత్మను కోరుకునేవాణ్ని
నేనో బాటసారి
నేనో పిపాసిని....
గిద్దలూరు సాయి కిషోర్