నాబడి
చదువుల గుడి
నా కళ్లముందే
కనుమరుగైపోతున్నది
ఒకవైపు
కాన్వెంట్ చదువుల మోజు
మరోవైపు
విలీనపు పిడుగు
ఇది ఒక వింత నాటకం
బాధ్యత నుంచి
తప్పించుకోవాలనే ప్రయత్నం
సర్కారీ బడులు
కనుమరుగైతే
కార్పోరేట్ బడులు
కళకళలాడతాయి
కాసులు గలగల లాడుతాయి
నిరుద్యోగం దూరం చేయలేని
ప్రభుత్వ నిర్ణయాలు
పిల్లలను
బడులకు దూరం చేస్తున్నాయి
చదువు వ్యాపారం కాదు
చదువు వ్యవసాయం
పదిమందికి
దారి చూపుతుంది
మరి సర్కారు బడి దూరమైతే
బడుగు బలహీన వర్గాల
విద్య ఏమవుతుంది?
మొర్రి గోపి
88978 82202










