Oct 19,2022 17:16

ఇంటర్నెట్‌డెస్క్‌ : మీరు వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్నారా? అయితే హూలా హూప్స్‌ని ప్రయత్నించండి అని వైద్యులు సలహా ఇస్తున్నారు. హూలాహూప్స్‌ని మనం సర్కస్‌ల్లో చూస్తూ ఉంటాం. రింగ్‌ని నడుమ దగ్గర ఉంచి.. లయబద్ధంగా తిప్పుతూ.. చూపుతిప్పుకోనివ్వకుండా చేయడమే సర్కస్‌వాళ్ల ప్రత్యేకత. ఈ రింగ్‌లతో వ్యాయామం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్యులు సూచిస్తున్నారు. మరి అవేంటో తెలుసుకుందామా..!

కొవ్వుని తగ్గిస్తుంది
రోజూ ఒక గంటపాటు ఈ వ్యాయం చేస్తే.. దాదాపు 400 క్యాలరీలను తగ్గిస్తుందని పరిశోధనల్లో తేలింది. మీరు రోజులో కనీసం పదినిమిషాలపాటు ఈ వ్యాయామం చేసినా.. కొవ్వు తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు.

గుండెకు మంచిది
రోజులో పావుగంట ఈ వ్యాయామం చేయడం వల్ల గుండె కండరాలు దృఢంగా మారడమే గాక, గుండెతోపాటు మిగతా అవయవాలకు కూడా రక్తప్రసరణ జరిగేలా చేస్తుందట. అందుకే వైద్యులు హూలాహూప్స్‌ వల్ల గుండెకు చాలామందని డాక్టర్లు చెబుతున్నారు.

321

వెన్నునొప్పి సమస్యను తీరుస్తుంది
ఆఫీసులో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల..చాలామంది వెన్నునొప్పి సమస్యతో బాధపడతారు. ముందూ, వెనుకకు కదులుతూ చేసే ఈ వ్యాయామం వల్ల వెన్నుముక కండరాలకు రక్తప్రసరణ జరిగి వెన్నునొప్పి సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అయితే వైద్యుల సలహామేరకే ఈ వ్యాయామాన్ని చేయాలి. లేకపోతే వెన్నునొప్పి కొంతమందిలో మరింత తీవ్రమైన నొప్పిగా మారుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
- ఈ వ్యాయామం మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ముఖ్యంగా ఏకాగ్రతను పెంచుతుందని పరిశోధనల్లో రుజువయింది. అలాగే మిగతా క్రీడల మాదిరిగానే.. ఈ వ్యాయామం కూడా కంటికి, చేతుల కండరాలకు మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

235