ప్రజాశక్తి-విజయనగరం కోట : టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ .... ఎపి రాష్ట్రవ్యాప్తంగా రిలే నిరసనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ... విజయనగరం నియోజకవర్గ టిడిపి నాయకులు మూడో రోజు రిలే నిరసనలు కొనసాగిస్తున్నారు. ' బాబుతో నేను ' కార్యక్రమంలో భాగంగా ఈ రిలే నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక అశోక్ బంగ్లా టిడిపి కార్యాలయం వద్ద నల్ల కండువాలతో టిడిపి నేతలు నిరసన తెలిపారు. మరోవైపు చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ప్రజల ద్వారా సంతకాల సేకరణ ఫ్లెక్సీ పై చేపట్టారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ .... చంద్రబాబు నాయుడుని విడుదల చేసే వరకు ఈ నిరసన దీక్షలు కొనసాగుతాయన్నారు. చంద్రబాబుపైన మోపిన మోసపూరితమైన కుట్రలో భాగంగానే అరెస్ట్ చేయడం జరిగిందని అన్నారు. ఈ ముఖ్యమంత్రి ఏ ముఖం పెట్టుకొని విజయనగరం వస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వచ్చినప్పుడు రోడ్డుపై బైఠాయించి నిరసనలు తెలపడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉందన్నప్పుడు గుంపులు గుంపులుగా తిరగకూడదు అని అన్నారనీ.. మరి ఈరోజు విజయనగరంలో స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అడ్డాలోనే తుంగలో తొక్కిన 144 సెక్షన్ ను పక్కనపెట్టి ఈ వైసీపీ నాయకులు బైక్ ర్యాలీలు గుంపులు గుంపులుగా వెళ్లడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఇది చూస్తుంటే వైసీపీ నాయకులకు ఒక రూలు, మిగతా పార్టీ నాయకులకు , ప్రజలకు ఒక రూలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. జిల్లాలో ఉన్న జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ వైసీపీ నాయకులకు తొత్తుగా మారాలనుకుంటున్నారా ? లేదా ఒక ప్రభుత్వ అధికారులుగా వ్యవహరించాలనుకుంటున్నారా ? ఇది ప్రజలకు సమాధానం చెప్పాలని అడాగారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, పట్టణ అధ్యక్షులు ప్రసాద్, కార్యదర్శి బంగారు బాబు, విజయనగరం మండల పార్టీ అధ్యక్షులు బొద్దుల నర్సింగరావు, కార్యదర్శి గంటా పోరిలాయుడు శ్రీనివాసరావు, నర్సింగరావు, వి.ప్రసాద్, కోదండరాం, రాజు చైతన్య, ఇతర టిడిపి నాయకులు పాల్గొన్నారు.










