Nov 28,2022 18:50

ప్రస్తుతం ఇండిస్టీలో రీ-రిలీజ్‌ల హవా నడుస్తుంది. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటించిన బాబా చిత్రం 2002లో విడుదలైంది. అప్పటో ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్‌లకు నష్టాల్ని తెచ్చిపెట్టింది. కాన్సెప్ట్‌ కొత్తదే అయినా, కథనం బోరింగ్‌గా ఉండటంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తిరస్కరించారు. కాగా ఇరవై ఏళ్ల తర్వాత ఈ సినిమాను మళ్లీ విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు మేకర్స్‌. రీ-రిలీజ్‌ వెర్షన్‌లో కొన్ని కొత్త సీన్స్‌ను యాడ్‌ చేస్తున్నారు. తాజాగా ఆ సీన్స్‌కు సంబంధించిన డబ్బింగ్‌ను రజనీకాంత్‌ పూర్తి చేశాడు. సురేష్‌ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీకి జోడీగా మనీషా కొయిరాల నటించింది. ఏ.ఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని లోటస్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై రజనీ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించారు.