Jul 29,2023 19:35

అమరావతి : ఏపీలోని కర్నూలు జిల్లాలో విషాదం నెలకొని ఉంది. మొహర్రం వేడుకల్లో అపశ్రుతి జరగడంతో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. జిల్లాలోని సి.బెళగల్‌ మండలం గొల్లలదొడ్డిలో గ్రామానికి చెందిన యువకులు మొహర్రం వేడుకల్లో అలంకరణ ఏర్పాట్లు చేస్తుండగా శేఖర్‌ అనే యువకుడు కరెంట్‌ షాక్‌కు గురయ్యాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. శేఖర్‌ హైదరాబాద్‌లో బీటెక్‌ చదువుతున్నాడు. వర్షాల కారణంగా ఇచ్చిన సెలవుల కారణంగా ఇంటికి చేరుకున్న యువకుడు మొహర్రం వేడుకల్లో ఉత్సాహంగా పాల్గోనేందుకు వెళ్లి మృత్యువాత పడడంతో అతడి కుటుంబంలో విషాదం నెలకొని ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.