ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్ : యునైటెడ్ కింగ్డమ్ స్కాట్లాండ్ దేశానికి చెందిన బిటిఐఇఐ సంస్థ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలో ఆసుపత్రులను నిర్మించేందుకు సన్నాహాలను సిద్ధం చేస్తుంది. ఇంతకాలం స్కాట్లాండ్ దేశంలో రియల్ ఎస్టేట్, వేర్ హౌసింగ్ వంటి రంగాల్లో రాణించిన బిటిఐఇఐ కాకినాడ జిల్లాలో ఆసుపత్రుల నిర్మాణ రంగంలోకి ప్రవేశించింది. దీనికి సంబంధించిన వివరాలను బుధవారం కాకినాడ జిఆర్టి గ్రాండ్ హౌటల్లో వెల్లడించారు. ఈ సందర్భంగా బీటీఐఇఐ డైరెక్టర్ నీల్ లాల్ మాట్లాడుతూ.. తమ పూర్వీకులు దేశంలోని పంజాబ్ రాష్ట్రంనకు చెందిన వారని స్కాట్ స్కాట్లాండ్లో తాను స్థిరపడినట్లు చెప్పారు. కాకినాడ జిల్లాలో ఆసుపత్రులు నిర్మించాలని తలచామన్నారు. కాకినాడ పరిసరాల్లో మూడు ప్రదేశాలను ఎంపిక చేస్తామని వాటిలో ఒకచోట ఈ ఆసుపత్రులు సముదాయాన్ని నిర్మిస్తామన్నారు. అనంతరం దీనికి సంబంధించిన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ప్రతినిధులు పంతం సందీప్, రాజా రత్నకుమార్ కర్రి, పూజ తదితరులు పాల్గొన్నారు.










