Dec 18,2022 07:24

            బిజెపి ప్రభుత్వ అనాలోచిత, ఏకపక్ష విధానాలు రోజు రోజుకు ప్రమాదకరంగా మారుతున్నాయి. పెరుగుతున్న అధిక భారాలు, పన్నులు, నిరుద్యోగం, నూతన విద్యావిధానం, ప్రభుత్వ రంగసంస్థల ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, రాజ్యాంగ వ్యవస్థల్లో అనుచిత జోక్యం, రక్షణ రంగంలో ఉద్యోగాల కోతకు వ్యతిరేకంగా దేశ ప్రజలు పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మభ్యపెట్టిరది. అయితే ...గత ఎనిమిదేళ్లలో.. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా తన కార్మిక వ్యతిరేక విధానాలతో 1,12,509 పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో 6 కోట్ల మందికి ఉపాధి లేకుండా చేశారు. రైౖల్వేరంగాన్ని కార్పోరేట్‌ సంస్థలకు అప్పనంగా అప్పజెప్పుతున్నారు. విశాఖ ఉక్కును నష్టాల పేరుతో విదేశీ కంపెనీలకు అమ్మివేసెే ప్రయత్నం చేస్తున్నారు. మేధావులను, ప్రజాతంత్ర వాదులను దేశద్రోహం పేరుతో కేసుపెట్ట్టి అరెస్టు చేసి నెలల తరబడి, సంవత్సరాల తరబడి జైళ్ళలో బందిస్తున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక, దిగుబడిలేక ఎంతో మంది రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కరోనా వైరస్‌ కష్టకాలంలో ఉపాధిలేక వేలాదిమంది ఆకలితో అలమటించిన పరిస్థితులను చూసి చలించిన వామపక్షపార్టీల నాయకులు డివైయఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ..లాంటి ప్రజాసంఘాల నాయకులు వారిని దగ్గరికి తీసి, వారి ఆకలిని తీర్చి వారిని వారి గమ్యస్థలాలకు చేర్చే ప్రయత్నం చేశాయి. కానీ ప్రభుత్వం మాత్రం గాలికొదిలేసింది. మహిళలపై అత్యాచారాలు ఎక్కువయ్యాయి. హిందుత్వ అజెండాను అమలు చేసేందుకు విశ్వవిధ్యాలయాలలో విసీలను, న్యాయవ్యవస్థలో జడ్జీలను, అలాగే పలు రాజ్యాంగ పదవులలో ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం కలిగిన వ్యక్తులను నియమిస్తున్నారు. విద్యావ్యవస్థను కాషాయీకరణ చేసే ప్రయత్నంలో భాగంగానే జాతీయ నూతన విద్యావిధానం తీసుకొచ్చారు. మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో పాలక పార్టీ వైసిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేన పార్టీలు, బిజెపి విధానాలను వ్యతిరేకించకుండా అనుకూల రాజకీయాలు చేస్తున్నారు.

- యస్‌. హుస్సేన్‌ బాషా
డివైఎఫ్‌ఐ, కర్నూలు
9966071040