Oct 17,2023 17:13

న్యూఢిల్లీ : బిజెపి ఎంపి నిషికాంత్‌ దూబే..తృణమూల్‌ కాంగ్రెస ఎంపి మహువా మొయిత్రాపై చేసిన ఫిర్యాదును లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా ఎథిక్స్‌ కమిటీకి సిఫార్సు చేశారు. 2019 నుంచి 2023 మధ్య కాలంలో మహువా లోక్‌సభలో అడిగిన 61 ప్రశ్నల్లో 50 ప్రశ్నలు దర్శన్‌ హీరానందానీ కోరిక మేరకే ఆమె అడిగారని నిషికాంత్‌ ఆరోపణలు చేశారు. అదానీ గ్రూప్‌ను, ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్‌ చేసి మాట్లాడేందుకే మహువా హీరానందానీ దగ్గర కోట్లాది రూపాయలు లంచం తీసుకున్నారని, దీనికి సంబంధించిన సాక్ష్యాలు తనకు సుప్రీంకోర్టు లాయర్‌ అందించారని, మహువాను తక్షణమే లోక్‌సభ నుంచి సస్పెండ్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అయితే నిషికాంత్‌ ఫిర్యాదును ఓంబిర్లా ఎథిక్స్‌ కమిటీకి సిఫార్సు చేశారు.
అయితే నిషికాంత్‌ దూబే ఆరోపణలపై తణమూల్‌ ఎంపీ మహువా తీవ్రంగా స్పందించారు. తనపై ఉన్న అభియోగాలపై దర్యాప్తును పూర్తి చేశాక తనపై ఎలాంటి చర్యలు తీసుకున్నా స్వాగతిస్తానన్నాని మహువా అన్నారు. ఇక బీజేపీ ఎంపీ ఆరోపణల్ని హీరానందానీ గ్రూప్‌ ఖండించింది. అవన్నీ అవాస్తవాలని స్పష్టం చేసింది.