ప్రజాశక్తి-బి.కొత్తకోట (అన్నమయ్య) : ప్రజలకు సేవలందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న వాలంటరీలపై దుష్ప్రచారం చేయడం తగదని ఇందుకు నిరసనగా ... బి.కొత్తకోట నగర పంచాయతీ పరిధిలోని ఐదు సచివాలయం కన్వీనర్లతో జెసిఎస్ మండల కన్వీనర్ రెడ్డి హరి శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... ప్రజలకు ఉన్న సమస్యల పరిష్కరానికి ఎంతో కృషి చేస్తూ ఇంటివద్దకే వచ్చి పరిష్కరిస్తున్న వాలంటరీ పై దుష్ప్రచారం చేయడం తగదని ప్రజల దగ్గర నుండి వారి సమస్యలను గుర్తించి సేవలను అందించడంలో వాలంటీర్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ఇది ఓర్వలేని జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ వాలంటరీలపై నిందలు వేయడం తగదని అన్నారు. గతంలో వాలంటరీ వ్యవస్థ లేనప్పుడు పెన్షన్ ఇవ్వాలంటే పంచాయతీ చుట్టూ ఎండలో తిరుగుతూ ఎప్పుడు ఇస్తారో తెలీక కళ్ళు తిరిగి పడిపోయిన సందర్భాలు ఎన్నో చూశామని, వృద్ధులకు ప్రజలకు అవస్థలు ఉండకూడదని ఒకే ఒక ఉద్దేశంతో వాలంటరీ వ్యవస్థ తేవడం అది ముఖ్యమంత్రికి చెల్లిందని అలాంటి వ్యవస్థపై దుష్ప్రచారం చేస్తున్న జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు నిరసనగా ... నగర పంచాయతీ ఆఫీస్ వద్ద నిరసన తెలుపుతున్నామన్నారు. అనంతరం పవన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్లు కళ్యాణ్ కుమార్ రెడ్డి, గుమ్మడికాయల చాంద్ భాష, సిఆర్ చిన్నికృష్ణ, అంజమ్మ, తుమ్మ గింజలు జనార్ధన్, వాలంటీర్లు, గృహసారుధులు పాల్గొన్నారు.










