Sep 10,2023 15:53

ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్‌(అనకాపల్లి) : మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆధ్వర్యలో టిడిపి నాయకులు ఆదివారం సామూహిక రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలో చింతకాయల పద్మావతి, చింతకాయల రాజేష్‌, టిడిపి కౌన్సిలర్సు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. రాష్ట్రానికి మంచి పనులు అందించిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును అక్రమంగా కేసులో ఆక్రమణ అరెస్టు చేయడం దారుణమైన చర్యన్నారు. పోలీసులు సిఐడి అధికారులు ముఖ్యమంత్రి కళ్ళలో ఆనందం చూడడానికి పనిచేస్తున్నారే.. తప్ప ప్రజా సేవ చేయనందుకు పని చేయట్లేదన్నారు. వీరందరికీ రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తామన్నారు. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం అని దాన్ని ఎవరు అడ్డుకోలేరని వచ్చిన తర్వాత ఇటువంటి వారిపై అందరిపైనా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలన్న ఈ సైకో ప్రభుత్వం పోవాలని సైకిల్‌ రావాలని ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడిని మనందరం ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు అయిన వెంటనే ఆరుగురు గుండెపోటుతో మరణించారని వారందరికీ సంతాపంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.