ప్రజాశక్తి - పెద్దాపురం(కాకినాడ) : రిలయన్స్ ఫౌండేషన్ సంస్థ అందజేసే స్కాలర్షిప్పులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని రిలయన్స్ ఫౌండేషన్ మేనేజర్ బి నాగేశ్వరరావు అన్నారు.గురువారం స్థానిక మహారాణి కళాశాలలో బయాలజీ హెచ్ ఓ డి జి జ్యోతిర్మయి అధ్యక్షతన స్కాలర్షిప్పులపై జరిగిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు.రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు రాత పరీక్ష నిర్వహించి మెరిట్ సాధించిన విద్యార్థులను స్కాలర్షిప్పులకు ఎంపిక చేస్తామన్నారు.విద్యార్థులకు ఇంటర్మీడియట్లో 60 శాతం మార్కులు వచ్చి ఉండాలన్నారు.వారి వార్షిక ఆదాయం రూ 2 లక్షల నుండి 15 లక్షల వరకు ఉండవచ్చన్నారు.ప్రధానంగా రూ 2 లక్షల 50 వాళ్లకంటే తక్కువ ఉన్నవారికి ప్రయారిటీ ఉంటుందన్నారు.త్వరలోనే దీనికి సంబంధించిన పరీక్ష నిర్వహించబడుతుందన్నారు.ఈ పరీక్షలో మెరిట్ సాధించిన విద్యార్థులకు ప్రతి ఏడాది రూ 50 వేలు చొప్పున 4 సంవత్సరాల పాటు స్కాలర్షిప్ ఇస్తారన్నారు.గత ఏడాది ఈ టెస్టులో క్వాలిఫై అయి స్కాలర్ షిప్ తీసుకుంటున్న విద్యార్థిని మౌనికను ఈ సందర్భంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు భానుమూర్తి,రిలయన్స్ ఫౌండేషన్ ప్రోగ్రాం సపోర్టర్ యు రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.










