
తాడేపల్లి: కడప వైసిపి ఎంపీ అవినాష్‌రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమయ్యారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్‌రెడ్డిని సీబీఐ నిందితుడిగా చేర్చిన సంగతి తెలిసిందే. దీనిపై పలుమార్లు అవినాష్‌ను విచారించిన సీబీఐ అధికారులు ఇటీవల సీబీఐ కోర్టులో ఛార్జిషీట్‌ను కూడా దాఖలు చేశారు.ఈ నేపథ్యంలో అవినాష్‌రెడ్డి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.