ప్రజాశక్తి-చిప్పగిరి (కర్నూలు) : శ్రీకృష్ణదేవరాయల పరిపాలనలో నిర్మించిన ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీ భోగలింగేశ్వర స్వామిని రైల్వే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ధనుంజయుడు దంపతులు మంగళవారం దర్శించుకున్నారు. వీరికి కమిటీ సభ్యులు వేద పండితులు ప్రత్యేక ఆహ్వానం దర్శనం కల్పించారు. వీరిని చిప్పగిరి రైల్వే కాంట్రాక్టర్ పంచాయతీరాజ్ ఉమ్మడి జిల్లాల వింగ్ అధ్యక్షులు జడ్పిటిసి విరుపాక్షి, చిప్పగిరి జ్యువెలర్స్ యజమాని పారిశ్రామికవేత్త సత్య ప్రతాప్ వేరువేరుగా ఆహ్వానించి పుష్పగుచ్చం అందజేసి, శాలువా పూల దండలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.










