ఆర్థిక సంబంధాలను
అన్నింటికీ ముడివేయకు..!
అర్థించకముందే చేరుకొని
ఆపదను తీర్చుతుండుము..!!
ప్రేమ ఆప్యాయతలను
పైకము పెట్టి కొనలేము..!
అడగకముందే అందించి
అనురాగాన్ని పంచుము..!!
మనల్ని రమ్మంటేనే
పోవాలనుకోవడం కాదు..!
కొన్నింటికి తెలిస్తేనే
మనం వెళ్లిపోవాలి..!!
కష్టాలు సుఖాలన్నవి
కనిపించకుండా వచ్చును..!
సుఖంగుంటేనే దరిచేరకు
కష్టమున్నపుడే పారిపోకు..!!
కట్టుకున్న బంధాలకు
పెట్టబోకు సరిహద్దులు..!
కట్టుదిట్టం చేసుకుంటూ
కుమిలిపోకు మనసులో..!!
పసుల శంకర్
9542181301