'మేలుకో' అనే ఒక్క మాటతో
యావత్ జగత్తు మత్తు వదిలి మేలుకొన లేదా!
జననం నుండి మరణం దాకా
ఆశలు, మోహాలు పెంచుకొంటూ
తీరని వాటి కోసం పరితపిస్తూ
ఒకదానితో మరొకటి ముడిపెడుతూ
కన్నులకు చూసినదంతా ఆకట్టుకొంటుంటే
అంతమేముంది ఇక ఆశలకి
ఈ ఆశల వలలో చిక్కి
భ్రమలోనే బ్రతుకు ఈడుస్తూ ..
ఏది ఎందుకు.. ఏది ఎంత వరకో తెలియక
నిలువెల్లా కమ్ముకొన్న కోరికల వలయంలో చిక్కి
కలలు, కలలుగానే మిగిలిపోతాయా అని
భయం భయంగా సాగిపోతున్న జీవితాలకు
ఏమి చెప్పగలం ?
ఇకనైనా వదలవా నీ ఆశల మత్తుని
అని గట్టిగా ప్రశ్నిస్తున్నా
ఆ చెవులకు వినపడటం లేదు,
ఆ కన్నుల ఆకాంక్ష ఆగనే లేదు
మనస్సులో చలనం రానే లేదు
మధురమైన జీవితం మట్టికి చేరేలోగా
మనిషి విలువ ఈ స్వార్థపు ఆశలతో నలిగి
మిగిలేనా అని నా ప్రశ్న ?
దేవేంద్ర
9642008810