Nov 05,2023 19:15

స్వయంభూ కోసం సవ్వసాచిగా..హీరో నిఖిల్‌ నటిస్తున్న తన 20వ చిత్రం 'స్వయంభూ. భరత్‌ కఅష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. ఠాగూర్‌ మధు సమర్పణలో పిక్సెల్‌ స్టూడియోస్‌కు చెందిన భువన్‌, శ్రీకర్‌ నిర్మిస్తున్న ఈ ఎపిక్‌ ఒడిస్సీలో లెజెండరీ యోధుని పాత్రను పోషించడానికి ఆయుధాలు, మార్షల్‌ ఆర్ట్స్‌, గుర్రపు స్వారీలో నిఖిల్‌ శిక్షణ తీసుకున్నారు నిఖిల్‌. నమ్మశక్యం కాని యుద్ధ సన్నివేశాలతో ఉండే ఈ చిత్రంలో నిఖిల్‌ కొన్ని అద్భుతమైన స్టంట్స్‌ చేయనున్నారు. దీని కోసమై వియత్నాంలో దాదాపు ఒక నెల రోజులు కఠోర శిక్షణ తీసుకున్నారు. ట్రైనింగ్‌ సెషన్‌ పూర్తయిన వెంటనే నిఖిల్‌ కత్తి యుద్ధం మొదలైనవాటిలో ప్రోగా మారడానికి ప్రాక్టీస్‌ చేయడం ప్రారంభించారు. కఠినమైన ప్రాక్టీస్‌ సెషన్‌ నిఖిల్‌ను సవ్యసాచిగా చేసింది. ఇప్పుడు రెండు చేతులతో కత్తియుద్ధం చేయగలుగుతున్నారు. నిఖిల్‌ షేర్‌ చేసిన వీడియో, కత్తి యుద్ధంలో అతని నైపుణ్యాన్ని చూపుతుంది. బ్యాక్‌ టు బ్యాక్‌ బ్లాక్‌బస్టర్స్‌తో దూసుకెళ్తున్న సంయుక్త ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.