Oct 06,2023 19:30

అర్జెంటీనాకు చెందిన మాజీ అందాల సుందరి, నటి జాక్వెలిన్‌ కరీరీ మరింత అందంగా మారేందుకు కాస్మోటిక్‌ సర్జరీ చేసుకుంది. సర్జరీ జరుగుతున్న టైంలో రక్తం గడ్డకట్టడం వల్ల ఆమె చనిపోయినట్లు తెలుస్తోంది. పలు ఇంగ్లీష్‌ చిత్రాల్లో నటించిన ఈమెకు బాగానే గుర్తింపు ఉంది. ఆమె ఈనెల ఒకటోతేదీన చనిపోయింది. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు సోషల్‌ మీడియా ద్వారా శుక్రవారం వెల్లడించారు. కొన్నిసార్లు ఇంకాస్త అందంగా మారిపోవాలనే ఆరాటం ప్రాణాలు మీదకు తెస్తూ ఉంటుంది. హీరోయిన్‌ ఆర్తి అగర్వాల్‌, కన్నడ నటి చేతన రాజ్‌.. ఇలా సర్జరీల వికటించి చనిపోయారు.