ప్రజాశక్తి-ఏలేశ్వరం(కాకినాడ) : మండలంలోని ఎర్రవరం గ్రామంలో 538 ఎకరాలు ఆయకట్టు కలిగిన నల్ల తమ్మయ్య చెరువు ఆధునీకరించాలని ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి జిల్లాకు విచ్చేసిన ముఖ్యమంత్రిని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం నల్లతమయ్య చెరువు ఆయకట్టు రైతులకు నీటి కష్టాలు అధికంగా ఉన్నాయన్నారు. శివారు పొలాలకు నీరు అందకపోగా వాగులు వంకలు పొంగినప్పుడు మొత్తం పొలాలు మునిగిపోతున్నాయి అన్నారు. చెరువు ఆధునీకరణ జరిగితే ఆయకట్టు రైతులకు నీరందరమే కాకుండా ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మండలానికి రెండు పీహెచ్సీలను మంజూరు చేశారని ఏలేశ్వరం మండలంలో జె అన్నవరంలో మాత్రమే పిఎసి ప్రారంభమైందని మరో పిహెచ్సి ని ఎర్రవరంలో ఏర్పాటు చేయాలని కూడా కోరినట్లు బుజ్జి తెలిపారు. బుజ్జి వెంట ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఉన్నారు.










