అంతు లేని ఆలోచనలతో
మనశ్శాంతి కరువై,
అశాంతితో జీవించలేని మనసు
నిత్య గాయాలతో అల్లల్లాడుతోంది.
అలుపెరుగని గుండెకు ఎన్ని వేదనలో..
మరెన్ని మాటల తూటాల గాయాలో..
కాలం గాయాల్నే చేస్తున్నా,
కష్టం ముంగిట్లో తిష్టవేసినా,
వేదనలు తాపాలకు వేదిక కాగా
దుఃఖాన్ని ఆప్యాయంగా హత్తుకొని
హృదయంతో
చెప్పుకొంటున్న
భావాలన్నీ చెప్పాలంటే
ఎన్ని అనుభూతులను
అక్షరాలుగా మలచాలో,
ఎన్ని సంఘర్షణలకు
అనురూప రూపునివ్వాలో,
ఎంత ఆర్ద్రతతో
హృదయాలను తడపాలో..
తప్పదుగా మరి
గుండె బరువు తగ్గాలంటే..
వేమూరి శ్రీనివాస్
99121 28967










