అమరావతి: టిడిపి అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో మరో పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఫైబర్ నెట్ కేసులో తాజా వారెంట్‌ను వేశారు. టెరాసాఫ్ట్ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు ఫైబర్ నెట్ కాంట్రాక్టు ఇచ్చారని సీఐడీ అధికారులు అభియోగం మోపారు. ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్ అంశంపై ఏసీబీ కోర్టులో చంద్రబాబుపై సీఐడీ అధికారులు పీటీ వారెంట్ వేసిన విషయం తెలిసిందే.










