పంట చేలకు ప్రాణం పోసే
బక్కచిక్కిన దేహాలెవరవి?
బువ్వ పూలు పూయించే
బురద మట్టి మేనులెవరివి?
జాతి ఆకలి బాధలు తీర్చే
దానగుణ తనువులెవరివి?
వాళ్ళెవరో తెలియదు
రక్త సంబంధీకులు కారు
ఏమి కానీ వాళ్ళు మాత్రం
దేశానికి మెతుకు పెట్టేందుకు
బతుకులను దారబోస్తున్నరు
కాలం కక్షతో కళ్లెర్రజేసినా
కడు దరిద్రం వెంటాడినా
నేల తల్లిని వదలకున్నారు
సాయగుణం మరవనన్నారు
ఇదేమి విడ్డూరమో కానీ
కనిపించని భగవంతుణ్ణి
మనస్ఫూర్తిగా ఆరాధిస్తాం
కళ్లెదుటే కదలాడుతున్న
భుక్తిదాతను విస్మరిస్తాం
ఎద్దు ఏడ్చిన ఎవుసం
ఏడింతలుగా ఎదగదు
రైతు చావులున్న దేశం
సుసంపన్నమై వర్ధిల్లదు
ఇకనైనా రైతాంగానికి
వెన్నుదన్నుగా నిలుద్దాం
మెతుకు పెట్టే రైతన్నకు
భక్తితోడ ప్రణమిల్లుదాం
కోడిగూటి తిరుపతి
95739 29493