గండేపల్లి (కాకినాడ) : గండేపల్లి మండలంలోని ఎన్‌టి.రాజాపురం గ్రామ శివారులోని ఫారెస్ట్ సమీపంలో ఉన్న పశువుల సాలపై గుర్తు తెలియని జంతువు దాడి చేసిన ఘటన శనివారం గండేపల్లిలో జరిగింది. జంతువు దాడిలో ఒక లేగ దూడ మృతి చెందగా, కొన్ని పశువులకు గాయాలయ్యాయి. దాడి చేసిన జంతువు చిరుతపులిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటన స్థలానికి ఫారెస్ట్ అధికారులు చేరుకుని పరిశీలన ప్రారంభించారు.










