Jun 11,2023 13:34

ప్ర్రజాశక్తి ఆదివారం అనుబంధం స్నేహ కథలకు ఆహ్వానం పలుకుతోంది. మంచి కథలను ఎంపిక చేసి ప్రచురిస్తాం. కథ సమకాలీన పరిణామాలు, పరిస్థితుల నేపథ్యంగా ఉండాలి. ప్రపంచీకరణ నేపథ్యంలో వివిధ రంగాల్లో చోటు చేసుకున్న, చేసుకుంటున్న విపరిణామాలను కథాంశంగా తీసుకోవచ్చు. ప్రగతిశీల చైతన్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించే కథలకు ప్రాధాన్యత. మూఢ నమ్మకాలు పెంచేవిగా, ఏ సామాజిక తరగతిని ప్రత్యేకంగా నొప్పించేదిగా ఉండకూడదు. మాండలికాలు ఉపయోగించినా కథన శైలి అందరికీ బోధపడేలా ఉండాలి. నవ్యత, వైవిధ్యం కలిగిన కథలకు ప్రత్యేక ఆహ్వానం. కథ నిడివి (మెయిన్‌ కథ) 10వేల క్యారెక్టర్లు (1200 పదాలు) ఉండాలి. కథ ఓపెన్‌ఫైల్‌ కానీ, యూనీకోడ్‌లోగానీ కింద ఇచ్చిన మెయిల్‌ అడ్రస్‌కు పంపాలి. పేరు, పూర్తి చిరునామా, ఫోన్‌ నెంబరు తప్పక రాయాలి.

మా చిరునామా: స్నేహ, ప్రజాశక్తి దినపత్రిక, సర్వే నం:85డి, ప్రజాశక్తి భవన్‌, అమరారెడ్డి కాలనీ, అరవింద హైస్కూల్‌ దగ్గర, కుంచన పల్లి, తాడేపల్లి, గుంటూరు జిల్లా -522 501.
ఫీడ్‌బ్యాక్‌ నెంబర్‌ : 9490099006
మెయిల్‌ అడ్రస్‌ :

snehaweekly.praja@gmail.com

నిబంధనలు
హామీ పత్రాన్ని తప్పక జతచేయాలి.