Jul 17,2022 08:00

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : ఈ నెల 15న ఒడిశా పరిసర ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడనం శనివారం నాటికి వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీర ప్రాంతాల వైపు ప్రయాణించిందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో ఆయా రాష్ట్రాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురియనున్నాయని తెలిపారు. ఉత్తర కోస్తాపై దీని ప్రభావం ఉండడంతో కొన్నిచోట్ల రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు.