హైదరాబాద్: తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలతో పాటు నిజామాబాద్‌లో కురిసే అవకాశం ఉందని తెలిపింది. శనివారం, ఆదివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. జార?ండ్ పరిసరాల్లో ఉన్న అల్పపీడనం చత్తీస్‌గఢ్, విదర్భ మీదుగా తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉందని వెల్లడించింది. రాష్ట్రంలోకి క్రింది స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుంచి వీస్తున్నాయని తెలిపింది.










