
పిల్లలు ఈ ప్రపంచానికి నిత్యం వెలుగునిచ్చే దివ్వెలు. వాళ్ల కోసం ఏమైనా చేయాలి. ఇది చేస్తే అది వస్తుందని కోరికతో కాకుండా.. ఏదైతే పిల్లలకు మంచిదనుకుంటామో, వాళ్ళు సర్వంగా వికసించాలని అనుకుంటున్నామో అదే చేయాలి.

ఈ మూడు దశాబ్దాలుగా గ్రామాల్లో పాఠశాలల్ని ఏర్పరచి, విద్యను అందిస్తున్న అరవింద.. అన్ని స్కూళ్లలా కనిపించినా, కాస్తంత లోతుగా చూస్తే.. కొన్ని ప్రత్యేక ప్రయత్నాలు జరుగుతున్నాయి అనిపిస్తుంది. పిల్లలు స్వతంత్రంగా ఆలోచించే గుణాన్ని పెంపొందించడానికి రోజువారీ తరగతులు ఉండటం. టీచర్లను ఆ రీతిలో ఓరియంటేషన్ కలిగి ఉండటం, భయ రహిత వాతావరణంలో బాధ్యతాయుతముగా ఎదగడానికి కావాల్సిన ఏర్పాట్లు. కేవలం పరీక్షల కోసమే విద్య కాకుండా, జీవితానికి కావలసిన నైపుణ్యాలను కూడా చదువులో భాగం చేయడం. గాలి, వెలుతురుతో కూడి, వీలైనంతగా ప్రకతిలో కలిసి ఉండడానికి కావలసిన ఏర్పాట్లు. రోజువారీగా పుస్తక పఠనం (వఞ్‌వఅరఱఙవ తీవaసఱఅస్త్ర), ఆటలలో ఆసక్తి కలిగినవారికి, సంగీతం, డాన్స్, వాయిద్య పరికరాలు, కరాటే వంటి ఆసక్తులకు తగిన రీతిలో వారిని వారు వ్యక్తపరచుకునే అవకాశం. రోజువారీ అసెంబ్లీలు, అందరూ 100% పాల్గొనే బాలానందాలు, ప్రతి సంవత్సరం వారి ప్రగతిని పరీక్షల రూపంలో కాకుండా అమ్మానాన్నలు తెలుసుకొనే అకాడమీ డేమోస్, పాఠ్యాంశాలకు సంబంధించిన ఫీల్డ్ ట్రిప్స్ ఉంటాయి. ఇంకా ప్రముఖు లతో చర్చలు, విద్యావేత్త శివరాం గారితో డైలాగ్స్, కుకింగ్, ఫార్మింగ్‌లలో తరగతులు.. నడక, పరుగు, యోగ, ఈత (ఆదివారాలు) తదితరమైనవి ఏర్పాట్లు చేశాం. ఒక మంచిస్కూల్‌కి కావలసిన సదుపాయాలు ఏర్పరచాలి. అమ్మానాన్నలతో ఓరియంటేషన్లు.. పిల్లలు తమను తాము చూసుకోవడానికి పార్లమెంటరీ ఎలక్షన్స్, తదితరాలన్నీ స్కూల్ ప్రణాళికలో భాగం చేయడం. అన్నింటి నుంచి పిల్లలను ఇతరులతో పోల్చకుండా, అనవసరపు పోటీలు పెట్టకుండా వారి బాల్యం సంతోషంగా ఉండేట్లు చూడటం మన బాధ్యత.

ఇంద్రాణి. బి, ప్రిన్సిపాల్, అరవింద హైస్కూల్,
కుంచనపల్లి.