
న్యాయమూర్తులను నియమించేందుకు ప్రభుత్వానికి హక్కు వుందంటూ దాని గురించి చెబుతున్న రాజ్యాంగ స్ఫూర్తిని నొక్కి వక్కాణిస్తున్నారు. కొత్తగా ఎన్నికైన ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్... ఈ విషయంలో కేంద్ర మంత్రికి సహాయ, సహకారాలను అందించారు. ఇటీవల, కేశవానంద భారతి కేసులో సుప్రీం కోర్టు నిర్దేశించిన రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ప్రశ్నించే స్థాయికి ఉప రాష్ట్రపతి వెళ్ళారు. పార్లమెంట్ అత్యున్నతమైనదని ప్రకటించారు. పార్లమెంట్‌కు అనుగుణంగా ఎలా కావాలంటే అలా రాజ్యాంగాన్ని సవరించుకోవచ్చని కూడా సూచించారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా న్యాయ వ్యవస్థ సర్వస్వతంత్రంగా మనజాలదంటూ, రాజ్యాంగ పదవిని అధిష్టించిన ధన్‌కర్, మెజారిటీవాద ప్రభుత్వ నిరంకుశ ధోరణిని, ఉద్దేశ్యాన్ని స్పష్టంగా వెల్లడించారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు మరోసారి వార్తల్లో నిలిచారు. న్యాయమూర్తుల నియామకానికై సుప్రీం కోర్టు, హైకోర్టు కొలీజియంలకు సిఫార్సులు చేయడానికి కొత్తగా 'పరిశోధనా, అంచనా కమిటీ'ని ఏర్పాటు చేయాలని సూచిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్‌కు లేఖ రాశారు. ఈ కమిటీలో ప్రభుత్వ ప్రతినిధి వుండాలని ప్రతిపాదించారు.
దీంతో, న్యాయమూర్తుల నియామకంలో ప్రభుత్వ పాత్రను నొక్కిచెప్పడానికి, 1993లో సెకండ్ జడ్జిస్ కేసు ద్వారా నిర్ధారించబడిన న్యాయపరమైన ప్రాధాన్యతను రద్దు చేయడానికి మోడీ ప్రభుత్వ ప్రణాళికలో ఇది మరొక ముందడుగు అనే సంకేతాలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఎలాంటి పరిశోధనా, అంచనా కమిటీలు లేవు. కొలీజియం వ్యవస్థ ద్వారా పేర్లను ఎంపిక చేసే క్రమమే కొనసాగుతోంది.
2015లో జాతీయ జ్యుడీషియల్ నియామకాల కమిషన్ చట్టాన్ని సుప్రీం కోర్టు కొట్టివేసిన తర్వాత, ఈ తీర్పును పక్కన పెట్టడానికి మోడీ ప్రభుత్వం మార్గాలను అన్వేషిస్తోంది. కోర్టు పరిశీలనకు నిలబడగల నియామక క్రమాన్ని రూపొందించేందుకు సరైన చట్టాన్ని ఆమోదించడమే సుప్రీం కోర్టు తీర్పును అధిగమించగల ఏకైక రాజ్యాంగపరమైన మార్గంగా వుంది. ఇప్పటివరకు, ప్రభుత్వం అలా చేయలేదు. దానికి బదులుగా, వంచన మార్గాల ద్వారా న్యాయవ్యవస్థ స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అణగదొక్కడానికి అదేపనిగా ప్రయత్నం జరుగుతోంది.
గత కొద్ది మాసాలుగా, న్యాయమూర్తులను నియమించే కొలీజియం వ్యవస్థను విమర్శిస్తూ, ఇది రాజ్యాంగానికి పూర్తి విరుద్ధంగా వుందంటూ కేంద్ర న్యాయ శాఖ మంత్రి వరుసగా ప్రకటనలు గుప్పిస్తున్నారు. న్యాయమూర్తులను నియమించేందుకు ప్రభుత్వానికి హక్కు వుందంటూ దాని గురించి చెబుతున్న రాజ్యాంగ స్ఫూర్తిని నొక్కి వక్కాణిస్తున్నారు. కొత్తగా ఎన్నికైన ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్...ఈ విషయంలో కేంద్ర మంత్రికి సహాయ, సహకారాలను అందించారు. ఇటీవల, కేశవానంద భారతి కేసులో సుప్రీం కోర్టు నిర్దేశించిన రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ప్రశ్నించే స్థాయికి ఉప రాష్ట్రపతి వెళ్ళారు. పార్లమెంట్ అత్యున్నతమైనదని ప్రకటించారు. పార్లమెంట్‌కు అనుగుణంగా ఎలా కావాలంటే అలా రాజ్యాంగాన్ని సవరించుకోవచ్చని కూడా సూచించారు.
ప్రభుత్వంతో సంబంధం లేకుండా న్యాయవ్యవస్థ సర్వస్వతంత్రంగా మనజాలదంటూ, రాజ్యాంగ పదవిని అధిష్టించిన ధన్‌కర్, మెజారిటీవాద ప్రభుత్వ నిరంకుశ ధోరణిని, ఉద్దేశ్యాన్ని స్పష్టంగా వెల్లడించారు.
భారత ప్రధాన న్యాయమూర్తి రూపొందించి, పర్యవేక్షించే సంయుక్త పరిశోధనా కమిటీలో ప్రభుత్వ ప్రతినిధి వుండాలని కోరుతూ గతంలోనూ ప్రభుత్వం ఇదే రీతిలో లేఖలు రాసిందని తెలుస్తోంది. అయితే తాజాగా కేంద్ర మంత్రి రిజిజు రాసిన లేఖలో వున్న తేడా ఏమిటంటే...హైకోర్టులకు కూడా ఇటువంటి కమిటీలు వుండాలని కోరడం. హైకోర్టు స్థాయిలో కూడా కొలీజియంలకు మార్గదర్శకం చేయాలని కోరడమే. 2015లో ఎన్‌జెఎసి కేసులో సుప్రీం కోర్టు నిర్ణయానికి అనుగుణంగానే కొత్త 'మెమోరాండం ఆఫ్ ప్రొసీజర్' ఖరారవ్వాల్సి వుందనే సాకుతో ఇదంతా జరుగుతోంది.
హైకోర్టుల న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి వచ్చిన సిఫార్సులకు ఆమోద ముద్ర తెలియచేయకపోవడం ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న ఎత్తుగడల్లో ఒకటిగా వుంది. ఏడాది మొదట్లో, హైకోర్టుల కొలీజియం చేసిన సిఫార్సులు 104 వున్నాయి. న్యాయమూర్తుల నియామకంలో సమర్ధనీయం కానటువంటి ఈ జాప్యానికి జనవరి 6వ తేదీన సుప్రీం కోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది. మరో మూడు రోజుల్లో, నియామకం కోసం 44 మంది న్యాయమూర్తుల పేర్లకు ఆమోదం తెలియచేస్తామని అటార్నీ జనర్ కోర్టుకు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు కేవలం 9 పేర్లను మాత్రమే ఆమోదించారు. కాగా, కొలీజియం వ్యవస్థ అనేది ఈ దేశ చట్టమని, దీన్ని తప్పనిసరిగా అనుసరించాలని జస్టిస్ సంజరు కిషన్ కౌల్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు బెంచ్ పేర్కొంది.
ప్రభుత్వ ఆటంకవాద ఎత్తుగడలకు సుప్రీం కోర్టు ఇప్పటివరకు ఎలాంటి మొగ్గు చూపలేదు. పైగా, అన్ని చర్యలను తిప్పి కొట్టింది. కిరణ్ రిజిజు రాసిన తాజా లేఖకు కూడా అటువంటి గతే పట్టాలని కోరుకుందాం.
('పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం)