కోడికూతతో నిద్ర లేస్తూ
గడియారంలో ముళ్లులా
కాలంతో పోటీపడుతున్న
మహిళకు ఎన్ని పాట్లో
అనునిత్యం
బాధ్యతలను
సమర్థవంతంగా నిర్వహిస్తూ
అన్ని రంగాల్లో రాణిస్తూ
ఎన్నో ఉన్నత శిఖరాలను
అధిరోహిస్తూ
చైతన్య స్రవంతిలా
చేయూతనిస్తుంది
ప్రతిభా పాటవాలతో
లక్షల హృదయాలను
మేల్కొల్పుతూ
సంతోషంలో దుఃఖంలో
సర్వం తానై
సృష్టిని మోసే శక్తిగా
శక్తి స్వరూపిణిగా
శ్రమ శక్తిగా జీవితంలో
సమ్మెట పోట్లకు మూర్తిగా
మారిన భారత స్త్రీ
గంగాజలంలా పవిత్రం
ఆమె మనసు ఎప్పుడు
ఎదలోపల బాధల్ని అణిచి పెట్టి
పెదవి పై చిరునవ్వు
ఆభరణాన్ని
అలంకరించుకున్న
ప్రేమమూర్తి ఆమే
జ్ఞాన జ్యోతులను వెలిగించి
అంథకారాన్ని పారదోలే
ధన్యచరిత ఆమెది
మంత్రిగా సలహాలిస్తూ
అమ్మలా ఆదరిస్తూ
అన్నపూర్ణగా విలసిల్లి
అన్ని పాత్రల్లో ఒదిగి
త్యాగానికి పర్యాయ పదమై
జీవిత గమనంలో
విరామమెరుగని
ఆమె సేవలు అనన్యం
అజరామరం
జీవితంలో సెలవంటూ
లేని అమేకు వందనం
అభివందనం
జై స్వశక్తి జై స్త్రీ శక్తి
నెల్లుట్ల సునీత
79894 60657