Mar 12,2023 14:07

ఆమెకళ్లల్లో సంధ్య ఎరుపు
ఎంత దిగమింగుకున్నా తీరని ఆమె బాధ
కనురెప్ప పడకుండా ఎంత ప్రయత్నించినా సరే
వద్దు వద్దు కిందకి జారకు అని ఎంత వేడుకున్నా సరే

ఆ కన్నీటి బొట్టు వింటే కదా! కిందకి జారి
ఆమె పాదాలను స్పర్శించి, మృతి చెందింది
దాని వెంటే మరో కన్నీటి బొట్టు..

ఆమె కన్నీళ్లు ఆమెను స్పర్శిస్తూనే ఉన్నాయి
ఆమెకి తెలుస్తుంది కానీ ఏమి చేయాలి
ఒక స్త్రీ పడే బాధను ఓదార్చడానికి ఉన్నది
కేవలం ఆ కన్నీటి బొట్టు మాత్రమే!

వి.ప్రణీత, పదో తరగతి
సీతా నగరం, జిల్లా పరిషత్‌ స్కూల్‌