ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : కశింకోట బిసి బాలురు వసతి గృహం వద్ద అంబేద్కర్ వర్ధంతి వేడుకలు మంగళవారం ఉదయం జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ ఆదినారాయణ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సమాజం మార్పు రావాలంటే అంబేద్కర్ ఆశయం కొనసాగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు పావాడ సన్యాసి రావు, బిసి వసతి గఅహ సంక్షేమ అధికారి నారాయణ రావు, విద్యార్థులు పాల్గొన్నారు.










