May 02,2023 20:52

న్యూఢిల్లీ : భారీ ఆఫర్లతో సమ్మర్‌ సేల్‌ను ప్రారంభిస్తున్నట్లు అమెజాన్‌ ఇండియా తెలిపింది. మే 4 నుంచి 8 తేదిలో ఈ క్యాంపెయిన్‌ ఉంటుందని వెల్లడించింది. స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులు, కాస్మోటిక్స్‌, కిరాణా సరుకులు, గృహోపకరణాలు తదితర ఉత్పత్తులపై గొప్ప తగ్గింపు ఆఫర్లను ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఫ్రైమ్‌ సభ్యులకు మే 2 ఆర్థరాత్రి నుంచే సేల్‌ అందుబాటులో ఉంటుందని తెలిపింది.