Oct 23,2022 08:06

ఆ కటిక శిలను
సుందర శిల్పంగా చెక్కిందెవరు?
ఆ బీడు నేలను
సస్య క్షేత్రంగా మలిచిందెవరు?

ఆ కణుపుల వెదురును
స్వర వేణువుగా మార్చిందెవరు?
ఆ నూలు పోగును
సుందర వస్త్రంగా అల్లిందెవరు?

ఆ కఱ్ఱ దుంగను
సువర్ణ బొమ్మగా రూపుద్దిందెవరు?
ఆ కరడు ఇనుమును
పనిముట్టుగా సానబెట్టిందెవరు?

ఆ బురద మట్టిని
దాహార్తి పాత్రగా దిద్దిందెవరు?
ఆ మస్తిష్కమును
జ్ఞానదీపికగా వెలిగించిందెవరు?

ఆ జంతు చర్మమును
డప్పు వాద్యంగా మలిచిందెవరు?
ఆ రాకాసి బొగ్గును
ఇంధన వనరుగా మార్చిందెవరు?

ఇన్ని అద్భుతాలకు
మూలం మనిషే కదా !
మరి అదే మనిషి
మానవత్వానికి కాస్త అమరత్వం అద్దితే
ఇంకెంత బావుణ్ణు !!

- కోడిగూటి తిరుపతి,
9573929493