అద్భుత ప్రేమకు ప్రతిబింబం నాని, శౌర్యువ్ కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా చిత్రం 'హాయ్ నాన్నా'లో డిఫరెంట్ జోనర్ సాంగ్స్ ఆల్బమ్‌తో అలరిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలోని మొదటి రెండు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా నుంచి మూడో సింగిల్ 'అమ్మాడి' పాట తాజాగా విడుదలైంది.మృణాల్ ఠాకూర్ తన థర్డ్ యానివర్సరీని రివీల్ చేస్తూ తన పెర్‌ఫార్మెన్స్‌తో పాట ప్రారంభమవు తుంది. 'ఇది నా భర్తకు అంకితం చేస్తున్న చాలా ప్రత్యేకమైన పాట. అతను ఎప్పటిలాగే ఆలస్యంగా వస్తున్నారు. పాట నా మాతఅభాష తెలుగులో ఉంది' అంటూ మఅణాల్ వాయిస్‌తో పాట మొదలవుతుంది. ఈ పాట నాని, మఅణాల్‌ల స్వీట్, బ్యూటీఫుల్ ప్రేమకథను చూపిస్తూ పెద్ద వేడుకను సెలబ్రేట్ చేస్తోంది. ఈ సోల్ ఫుల్ మెలోడీ.. వారి పెళ్లి రోజు నుండి, వివాహ ప్రారంభ రోజులలో వారు కలిసి ఉన్న అద్భుతమైన రోజుల వరకు, ప్రేమ తాలూకా కొత్త అధ్యాయాన్ని అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది. ఈ పాటలో నాని, మఅణాల్ డిలైట్ ఫుల్ కెమిస్ట్రీ మెస్మరైజ్ చేస్తోంది. హేషామ్ అబ్దుల్ వహాబ్ ఇన్స్టెంట్‌గా కనెక్ట్ అయ్యే మరొక ప్లజెంట్ నంబర్‌ను అందించారు. మొదటి రెండు పాటల్లాగే ఇది కూడా ఆల్బమ్‌లో మరో బ్లాక్‌బస్టర్ సాంగ్ అవుతుంది. కఅష్ణకాంత్ ఆకట్టుకునే, మీనింగ్ ఫుల్ లిరిక్స్ అందించారు. కాల భైరవ, శక్తిశ్రీ గోపాలన్ వోకల్స్ చాలా ఎక్స్‌ప్రెసీవ్‌గా ఉన్నాయి. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ స్థాయిలో నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీలో బేబీ కియారా ఖన్నా ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. డిసెంబర్ 7న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ విడుదల కానుంది అని చిత్ర బఅందం తెలిపింది.