చినుకు చినుకు చినుకు
చిటపట చినుకు
ఒకటి రెండు మూడు
వందలు వేలూ.. అనంతాలై..
నదీ నదాలు.. వాగులు వంకలు..
కలిసి మెలిసి ప్రవహించి..
బారులు తీరి.. ఏరులై పారి..
సంద్రమై.. మహా సాగరమై..
జన బాహుళ్యానికి ఆలవాలమై..
అక్షరం.. అక్షరం.. అక్షరం..
లక్ష్యంగా చేరి
పదబంధం.. వాక్య రూపమై..
కథనా.. కవితనా..
గ్రంథమా.. ప్రబంధమేనా..
రూప రూపాంతరాలై
మనిషి మనిషికీ అనుబంధమాయె
జన జీవితమే అక్షర పొత్తమాయె..!
మరి..
సాగరం అంతమైతే..
జీవితం వింతబోదా..!
అక్షరం అంధమైతే
జీవన సారం కుంగిపోదా..!
అందుకే..
అక్షరానికి అంకితమౌదాం..
జగతికి జాగృతమౌదాం..
టి. టాన్య