ప్రజాశక్తి-పెదబయలు (అల్లూరి) : ఎయిడ్స్‌కు మందు లేదని నివారణా ఒక్కటే మార్గమని వైద్యాధికారిని జి.రమ అన్నారు. గురువారం ఎయిడ్స్ డే సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి పురవీదుల మీదుగా విద్యార్థులతో కలిసి భారి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎయిడ్స్‌కు మందు లేదని.. నివారణా ఒక్కటే మార్గమని అన్నారు. ఇది అంటువ్యాధి కాదు అంటించుకొనే వ్యాధి అని అన్నారు. విచ్చలవిడి శంగారం వద్దు దాంపత్య జీవితం ముద్దు అని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో సిబ్బంది జె.వెంకటరావు, ఎంపిహెచోఓ, సిహెచ్ పార్వతమ్మ పిహెచ్‌ఎన్ విద్యార్థులు పాల్గొన్నారు.










