Jul 07,2023 12:28

పుట్టపర్తి (శ్రీసత్యసాయి) : తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కోసం లైసెన్సు రివాల్వర్‌కు అనుమతి ఇవ్వాలంటూ ... సినీ నటుడు నరేశ్‌ శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డిని కోరారు. గురువారం నరేశ్‌ పుట్టపర్తిలోని ఎస్పీని కలిశారు. మావోయిస్టుల నుంచి తనకు ప్రాణహాని ఉండటంతో 2008లో లైసెన్స్‌ రివాల్వర్‌ పొందాననీ.. దానికి మళ్లీ అనుమతి ఇవ్వాలని అడిగారు. గతంలోనూ కోరగా ఇవ్వలేదని చెప్పారు. ప్రస్తుతం తాను హిందూపురంలో నివాసముంటున్నానని... లైసెన్సు రివాల్వర్‌ తన వద్ద ఉంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని నరేశ్‌... ఎస్పీని కోరారు. ఈ విషయాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చినట్లు నరేశ్‌ తెలిపారు.