అక్షర మక్షర యక్షరం
లక్ష సాధనాల్లో ఇది సుస్థిరం
శిక్షణ జగతికి చదువుల పుష్పం
అక్షరము ప్రతిభకు కట్టును పట్టం..
లోకం కానని లోయలో ఉన్నా
ఆప్తులు ఎరుగని వాడలో యున్నా
గువ్వ చూడని గుడిసెలో యున్నా
యేలు మేలనే మేడలో యున్నా
అక్షరమన్నది అందరి ఆస్తి
అక్షర వెలుగులో చీకటి నాస్తి..
పశువుగ అడవిలో తిరిగే మనిషికి
ప్రకృతి గుట్టును విప్పే ఘనతకి
అంతరిక్ష యాన సన్నాహానికి
అక్షర మొక్కటే వారధి రా
అక్షర జ్ఞానే సారధి రా..!
బల్ల కృష్ణవేణి
8341818138