మన బాధను
తన గుండెలో నింపుకునేది,
తన ఆనందాన్ని
మన కళ్ళల్లో చూసుకునేది!
ఎన్ని బంధాలు ఎదురైనా
తన బంధాన్ని విడువనిది,
ఎన్ని అడ్డంకులు ఎదురైనా
తన మనసు మనల్ని వదలనిది!
తన ఆకలి తీరేది
మన కడుపు నిండినప్పుడే,
తన అలసట తీరేది
మనం హాయిగా నిద్రించినప్పుడే!
ఎక్కడున్నా అమ్మ గుండె
మన అలికిడితోనే స్పందిస్తుంది,
దూరాలు ఎన్ని పెరిగినా
చల్లగాలులు అమ్మకొంగులై
జోకొడుతూ ఉంటాయి!
ఆకాశమంతా మనసును
భూగోళమంత బరువును
తన ఎదలో దాచుకొని
కాలం వెంట నడుస్తుంది!
తొమ్మిదినెలలే కాదు
తాను బతికుంటే మనల్ని
తొంభై ఏళ్లయినా మోస్తుంది!
- పుట్టి గిరిధర్
94949 62080