సౌత్ ఇండియాలో అద్భుతమైన కాంబినేషన్ మళ్లీ ఇప్పుడు మొదలవుతోంది. 1987లో నాయకన్ (నాయకుడు) సినిమా ద్వారా కలిసి పనిచేసిన కమల్‌హాసన్, మణిరత్నం జంట మళ్లీ 35 ఏళ్ల తర్వాత సినిమా చేయనున్నారు. కమల్‌హసన్ కెహెచ్ 234గా వస్తున్న ఈ సినిమా శుక్రవారం ప్రకటించిన చిత్రబృందం ప్రోమో విడుదల చేసింది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, రెడ్ జెయింట్ మూవీస్, మద్రాస్ టాకీస్ బ్యానర్లపై కమల్ హాసన్, మణిరత్నం, ఆర్.మహేంద్రన్, శివ అనంత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరించనున్నారు. 2024లో విడుదల కానున్న ఈ సినిమాలో నయనతార, జయం రవితో పాటు అతిధి పాత్రలో షారుఖ్ ఖాన్ లేక అజిత్ పేర్లు వినబడుతున్నాయి.