Oct 17,2023 16:46

ప్రజాశక్తి ఏలేశ్వరం(కాకినాడ): ప్రత్తిపాడు కోర్టు న్యాయవాదులు తమ సమస్యలు పరిష్కారం కోరుతూ కోర్టు విధులను బహిష్కరించి రిలే దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు చిట్టంశెట్టి పుల్లయ్య మాట్లాడుతూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ ఏకపక్షంగా తీసుకోన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెల్ఫేర్ స్టాంప్ ఒక రూపాయి నుండి 20 రూపాయలు ఒకేసారి పెంచడం వలన తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి అన్నారు. రాష్ట్రంలోని అన్ని బార్ అసోసియేషన్ పిలుపుమేరకు నేటినుండి గురువారం వరకు విధులు బహిష్కరించి ఆందోళనలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి బి మధుబాబు, గౌరవాధ్యక్షుడు చెలంకూరి రామకృష్ణ, ఉపాధ్యక్షుడు ఎం గంగాధర్, కోశాధికారి జొన్నాడ రాజేష్, లింగంపల్లి శివకుమార్, ఏ కుక్కుటేశ్వరరావు, రాజాల చిట్టిబాబు, రమణం వెంకట్రావు, పిల్లి బలరాముడు, బాధ జాన్ బాబు, కే శ్రీనివాసరావు ఎస్ గౌరీ శంకర్, పదివేల నాగేంద్ర,ఏ మల్లేశ్వరరావు, జి కామేష్, అచ్యుతరామారావు, అశోక్ కుమార్, ఎం మంజుష, కే లోవదుర్గ ఉన్నారు.