ప్రజాశక్తి - మచిలీపట్నం అర్బన్ : డిప్యూటీ మేయర్ తంటేపూడి కవిత అధ్యక్షత బుధవారం నిర్వహించాల్సిన మచిలీపట్నం మున్సిపల్ అత్యవసర సమావేశం మాజీ కౌన్సిలర్ షాహెదా బేగం సంతాప తీర్మానంతో వాయిదా పడింది. మచిలీపట్నం పురపాలక సంఘంలో 1994-2005 కాలంలో షాహెదా బేగం రెండు సార్లు కౌన్సిలరుగా పనిచేశారు. పార్టీపరంగా కార్యకర్త నుండి పట్టణ మహిళా అధ్యక్షురాలు, జిల్లా వక్ బోర్డు రాష్ట్రస్థాయి మహిళా సభ్యురాలిగా 2018 మార్చి నుండి 2022 ఫిబ్రవరి వరకు ఉన్నత పదవులు అలంకరించారు. జనవరి 21వ తేది అకాల మరణానికి చెందారు. మచిలీపట్నం నగరపాలక సంస్థ కౌన్సిల్ సభ్యులు షాహేదా బేగం ఆత్మకుశాంతి కోసం రెండు నిముషాలు మౌనం పాటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేస్తూ ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశం సంతాప తీర్మానంతో వాయిదా వేశారు. ఈ సమావేశంలో నగర పాలక సంస్థ కార్పరేటర్లు, కొఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.










