Oct 12,2023 19:16

వైష్ణవ్‌ తేజ్‌, శ్రీలీల కలిసి తొలిసారిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న 'ఆదికేశవ' చిత్రంలో నటిస్తున్నారు. శ్రీకాంత్‌ ఎన్‌ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. జి.వి. ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రబృందం 'హే బుజ్జి బంగారం' అనే మెలోడీని విడుదల చేసింది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా అర్మాన్‌ మాలిక్‌, యామిని ఘంటసాల ఎంతో అందంగా ఆలపించారు. జోజు జార్జ్‌, అపర్ణా దాస్‌ ఈ సినిమాతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. నవీన్‌ నూలి ఈ చిత్రానికి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. నవంబర్‌ 10న ఈ చిత్రం విడుదల కానుంది.