Oct 02,2022 09:23

అదే నింగి అదే నేల
నింగి నేల పంచభూతత్వమొక్కటే
నింగి నేలల్లో మార్పులు అనేకము!
అవే శిలలు అవే ఉలులు
శిల్పి ఊహల ఉలి దెబ్బలేకమే
కళలు ఉట్టిపడే శిల్పాలనేకము!
అదే నీరు అవే ఆవిరి మబ్బులు
కురిసే వర్షము
నీరు ఒక్కటే
ఉప్పొంగి పారే నదులు అనేకము !
అదే కడలి అదే జాబిలి
వచ్చే ఆటుపోటు లేకమే
ఎగిసిపడే కెరటాలు అనేకము!
అదే అదే శ్వేత వర్ణము
సప్తవర్ణాలు ఏకమే
కలగలసిన రంగులనేకము!
అదే మనిషి అదే మనసు
మనుషుల్లో మనసు ఏకమే
మస్తిష్కంలో ఆలోచనలనేకము!
అదే కాలమదే కాలము
పగలు రాత్రుల రోజు ఏకమే
కాలం మారిందనే వారు ఎందరో!
స్వాతంత్య్ర సంకేతాల జెండా
ఎగిరే తలమంతా ఏకమే
స్వేచ్ఛగా బ్రతికే జనులనేకము!


పి.బక్కారెడ్డి
97053 15250