May 21,2023 08:08

నాన్న పాతికేళ్ల
వయసులోని స్థితి గతులు
కళ్ళకు కట్టినట్లు అక్కడక్కడ
ఇప్పటికి ముళ్ళ కంపల
చుట్టుముడుతున్నట్టు ఉంటుంది...
కాలం పెరిగే కొద్దీ
కొత్త వస్తువులు, కొత్త పనులు
కొత్త పరిశ్రమలు, కొత్త కర్మాగారాలు
కొత్త విధి విధానాలు ఉన్నట్టే అనిపిస్తుంది
అభివృద్ధి చెందుతున్నట్టే అగుపిస్తుంది...
జీతానికి పనిచేసే జీవితాలు మాత్రం
చలనం లేని శిలల ఒడ్డుకు చేరని నావల ఉన్నాయి
ఆరోజుల్లో కొడవళ్ళు గొడ్డళ్లు నాగళ్ళు
రకరకాల పనిముట్లు పట్టి
శ్రమ దోపిడీకి గురయ్యేవారు
ఈ రోజుల్లో పెద్ద పెద్ద చదువులు డిగ్రీలు డాక్టరేట్లు
విలువైన జ్ఞానాన్ని చేతబట్టి
అదే బాటలో నడుస్తున్నారు
మనిషి శ్రమ వ్యాపారమైంది
మనిషి దోపిడీికి గురయ్యాడు
నాడు భూస్వామ్య వ్యవస్థ
నేడు పెట్టుబడిదారీ వ్యవస్థ
కార్పొరేట్‌ సంస్థల అధినేత చేతుల్లో
కీలు బొమ్మలుగా మారి
మనుషులు మాయమైపోతున్నరు
బతుకు తెరువు కోసం
బతుకు మీద భయంతో బానిసగా మారుతున్నారు
జీతగాని జీవన విధానంలో
ఎప్పటికి మార్పు వస్తోందని అడగాలనుంది

లక్ష్మీ శ్రీనివాస్‌
96766 01192