ఇంటర్నెట్‌డెస్క్ : ప్రముఖ నటుడు ప్రభాస్ మంచి భోజన ప్రియుడు అని సినీ ఇండిస్టీలోని పలువురు ప్రముఖులకి బాగా తెలుసు. అన్నీ ఇష్టంగా తినే ప్రభాస్ ప్రత్యేకంగా 'రొయ్యల పలావ్' అంటే తనకి బాగా ఇష్టమని సోషల్‌మీడియా ద్వారా తెలిపాడు. ప్రముఖ నటి అనుష్క నటించిన తాజా చిత్రం 'మిస్‌శెట్టి మిసెస్‌శెట్టి'. ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో అనుష్క చెఫ్‌గా కనిపించనున్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా అనుష్క తనకిష్టమైన వంటకాన్ని సోషల్‌మీడియాలో షేర్ చేసి.. తన స్నేహితుల్ని, సినీ ఇండిస్టీకి చెందిన పలువురిని వారికిష్టమైన వంటకాల్ని సోషల్‌మీడియాలో షేర్ చేయమని కోరారు. ఈ నేపథ్యంలో హీరో ప్రభాస్ 'రొయ్యల పలావ్' తనకెంతో ఇష్టమని.. ఆ వంటకాన్ని తయారు చేసే విధానాన్ని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. అనుష్క రెసిపీ ఛాలెంజ్‌ని మొదటగా ప్రభాస్ స్వీకరించి.. ఆ తర్వాత రామ్‌చరణ్‌కి ఈ ఛాలెంజ్‌ని పాస్ చేశాడు. మరి ఈ ఛాలెంజ్‌లో భాగంగా హీరో రామ్‌చరణ్ తనకిష్టమైన వంటకాన్ని సోషల్‌మీడియాలో షేర్ చేస్తారో లేదో చూడాలి మరి.!