ప్రజాశక్తి -అమరావతి బ్యూరో:విజయవాడ ఎసిబి కోర్టు అడిషనల్ జడ్జి హిమబిందుపై ఆమెకు వ్యక్తిగతంగా ఇబ్బంది కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టే వారిపై చర్యలు తీసుకోవాలని సిఎస్ జవహర్‌రెడ్డికి రాష్ట్రపతి భవన్ కార్యదర్శి పిసి మీనా లేఖ రాశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై సిఐడి నమోదు చేసిన కేసులో విజయవాడ ఎసిబి కోర్టు అడిషనల్ జడ్జి హిమబిందు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెను ఇబ్బందిపెట్టేలా పోస్టింగులు, వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన అడ్వకేట్ రామానుజరావు ఇ మెయిల్ ద్వారా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి భవన్ నుంచి చర్యలు తీసుకోవాలంటూ సిఎస్‌కు లేఖ వచ్చింది.