Jun 01,2023 15:39

ప్రజాశక్తి-ఆదోని(కర్నూలు) : మహిళా రెజ్లర్లపై వేధింపులకు పాల్పడిన బ్రిడ్జ్‌ భూషణ్‌ చరణ్‌ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని వామపక్ష, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. గురువారం దేశవ్యాప్తంగా వామపక్ష ప్రజా సంఘాల ఆందోళనలో భాగంగా పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా సిఐటియు జిల్లా కార్యదర్శి అంజిబాబు, ఉపాధ్యక్షులు పీ ఈరన్న, సిఐటియు అధ్యక్ష, కార్యదర్శులు తిప్పన్న, గోపాల్‌, ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష కార్యదర్శులు భరత్‌, శ్రీనివాసులు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడారు. రెజ్లర్లు ఆందోళన చేపట్టి 36 రోజులు కావస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవం విచారకరమన్నారు. క్రీడాకారులకున్న హక్కులను రక్షించాలని, వేధింపులు ఆరికట్టాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఆందోళనకు ప్రజా సంఘల ఆధ్వర్యంలో చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, ఎస్‌ఎఫ్‌ఐ కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు