ప్రజాశక్తి- తడ (తిరుపతి) : తడ మండలంలోని పులివేంద్ర గ్రామం సమీపంలోని వ్యవసాయ మార్కెట్ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై నుండి నెల్లూరు వైపు వెళ్తున్న కార్ కార్గో లారి, ముందు వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేసే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కార్గో లారీ ఓవర్ టేక్ చేసే ముందు వెళ్తున్న లారీ హఠాత్తుగా బ్రేక్ వేయడంతో దానిని ఢ కోట్టి డివైడర్‌పైకి ఎక్కి నిలిచింది. ఈ ప్రమాదంలో కార్ కార్గో లారి డ్రైవర్ ఇంతియాజ్ ఖాన్ (45) నడుంబాగం వరకు లారీలోనే ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న తడ పోలీసు ఘటనాస్థలానికి చేరుకుని ఇరుక్కున్న అతన్ని కాపాడి ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.అనంతరం ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.










